గతేడాది ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ జారవిడిచిన సంఘటనను ఎవరూ మరిచిపోలేరు. ఆ క్యాచ్‌ను నేలపాలు చేయడంతో అప్పట్లో సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి నెట్టింట్లో అతడు హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రెండు ఓవర్లలో ఏకంగా ఐదు నోబాల్స్ వేసి భారత ఓటమికి కారకుడయ్యాడు. ఇదే మ్యాచ్‌లో మరో రెండు నోబాల్స్‌ను శివమ్ మావి, ఉమ్రాన్ వేశారు. అలాగే ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ నోబాల్స్ (14) వేసిన బౌలర్‌గా అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు, మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి.
నో బాల్స్ వేసిందిలా..
శ్రీలంక ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్, 19వ ఓవర్‌ను అర్ష్‌దీప్ వేశాడు. అయితే రెండో ఓవర్‌లో హ్యాట్రిక్ నో బాల్స్‌తో మొత్తం 19 పరుగులు సమర్పించాడు. ఇక 19వ ఓవర్‌లోనూ 18 పరుగులు ఇచ్చాడు. దీంతో కేవలం రెండు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చేశాడు. అర్ష్‌దీప్ తన మొదటి ఓవర్‌లోని ఐదు బంతులు అద్భుతంగానే వేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అయితే చివరి బంతిని సంధించడంలోనే ఇబ్బంది పడ్డాడు.
- 1.6వ ఓవర్: కుశాల్ మెండిస్ బ్యాటింగ్.. నో బాల్ వేశాడు. ఫ్రీహిట్
- 1.6వ ఓవర్: కుశాల్ మెండిస్ ఫోర్ బాదాడు. మళ్లీ నోబాల్. ఇంకో ఫ్రీహిట్ వచ్చింది.
- 1.6వ ఓవర్: కుశాల్ సిక్సర్ దంచాడు. మూడోసారి నో బాల్. మరో ఫ్రీహిట్
- 1.6వ ఓవర్: ఫ్రీహిట్ బంతిని కొట్టేందుకు కుశాల్ ప్రయత్నించినా సింగిల్‌తోనే సరిపెట్టుకొన్నాడు. రౌండ్ ద వికెట్‌కు మారిన అర్ష్‌దీప్ ఎట్టకేలకు ఓవర్‌ను పూర్తి చేశాడు.
19వ ఓవర్‌లో..
- 18.4వ ఓవర్: శ్రీలంక కెప్టెన్ శనక బ్యాటింగ్.. ఫుల్ టాస్ వేసిన బంతిని లాంగ్‌ఆన్ దిశగా తరలించాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. తీరా అది నోబాల్. దీంతో శనక బతికిపోయాడు.
- 18.4వ ఓవర్: ఫ్రీహిట్ రావడంతో శనక సిక్స్‌గా మలిచాడు.
- 18.5వ ఓవర్: మరోసారి అర్ష్‌దీప్ లైన్ దాటాడు. అయితే శనక దీనిని సింగిల్‌తోనే సరిపెట్టాడు.
- 18.5వ ఓవర్: అర్ష్‌దీప్ యార్కర్ సంధించడంతో ఫ్రీహిట్ బంతిని కరుణరత్నె సరిగా ఆడలేకపోయాడు. ఈ బంతికి పరుగులేమీ రాలేదు.
- ఇలా ఐదు బంతులను అదనంగా వేసి మరీ 23 పరుగులను ఎక్కువగా సమర్పించుకొన్నాడు.
నెటిజన్ల నుంచి వచ్చిన మీమ్స్..
![trolls on arshdeep singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17410745_5.jpg)
![trolls on arshdeep singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17410745_4.jpg)
![trolls on arshdeep singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17410745_3.jpg)
![trolls on arshdeep singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17410745_1.jpg)
![trolls on arshdeep singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17410745_2.jpg)