ETV Bharat / sports

'మా మాటకు విలువిచ్చిన అందరికీ కృతజ్ఞతలు' - కోహ్లీ అనుష్క వామిక

Anushka Sharma thanks Paparazzi: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ.. వారి గారాలపట్టి వామికా ఫొటోలు, వీడియోలు బయటపెట్టొద్దని మీడియాను కోరారు. మరోసారి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు అనుష్క. వామికా ఫొటోలు, వీడియోలను బాహ్య ప్రపంచానికి చూపించకుండా తమ విన్నపానికి విలువ ఇచ్చిన ఫొటోగ్రాఫర్లు, మీడియా వ్యక్తులకు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటామని తెలిపారు.

Anushka Kohli Vamika, Anushka Sharma thanks paparazzi, అనుష్క శర్మ మీడియాకు థ్యాంక్స్, అనుష్క కోహ్లీ వామిక
Anushka Sharma
author img

By

Published : Dec 20, 2021, 1:01 PM IST

Anushka Sharma thanks Paparazzi: టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తాజాగా భారత ఫొటోగ్రాఫర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్న సమయంలో పలువురు ఫొటోగ్రాఫర్లు ముంబయి ఎయిర్‌పోర్ట్‌ వద్ద విరుష్క దంపతుల ముద్దుల కుమార్తె వామికా ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే, కోహ్లీ వారిని ఫొటోలు తీయెద్దని కోరారు. ఈ క్రమంలోనే కోహ్లీ మాటను గౌరవించి ఆ చిన్నారి ఫొటోలను బయటపెట్టనందుకు అనుష్క కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పోస్టు చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఇలా రాసుకొచ్చారు.

Anushka Kohli Vamika, Anushka Sharma thanks paparazzi, అనుష్క శర్మ మీడియాకు థ్యాంక్స్, అనుష్క కోహ్లీ వామిక
Anushka Kohli Vamika

"మా చిన్నారి వామికా ఫొటోలు, వీడియోలను బాహ్య ప్రపంచానికి చూపించకుండా మా విన్నపానికి విలువ ఇచ్చిన ఫొటోగ్రాఫర్లు, మీడియా వ్యక్తులకు మేం మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాం. ఇకపైనా మీరంతా ఇలాగే మాకు అండగా ఉంటారని అనుకుంటున్నా. మీడియాకు, సామాజిక మాధ్యమాలకు దూరంగా మా కుమార్తె స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నాం. తను పెద్దయ్యాక ఎలాగూ మేం తన స్వేచ్ఛకు అడ్డు చెప్పం కాబట్టి.. ఇప్పుడైనా తనని ఇలా వదిలేయాలని కోరుతున్నాం. అందుకు మీ సంపూర్ణ సహకారం కావాలని ఆశిస్తున్నాం. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ మా కూతురి ఫొటోలు పోస్టు చేయని నెటిజన్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు" అని అనుష్క పోస్టు చేశారు.

ఇవీ చూడండి: Ashes 2021: చివరి మూడు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.