ETV Bharat / sports

భళా - రెండు చేతులు లేకున్నా క్రికెట్ ఆడేస్తున్నాడు - అమీర్​ హుస్సేన్​ క్రికెటర్

Amir Hussain Lone Jammu Kashmir Cricketer : క్రికెట్‌ ఆడాలంటే రెండు చేతులు ఉండాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయాలంటే చేతులు తప్పనిసరి. అది అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది మాత్రం సవాళ్లను ఎదుర్కొని ఒక్క చేయితో కూడా ఆడినవారు ఉన్నారు. కానీ రెండు చేతులు లేకుండా క్రికెట్‌ ఆడేస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాడు జమ్ము కశ్మీర్‌కు చెందిన అమీర్‌ హుస్సేన్‌. అయితే తను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నాడు. ఓ సారి అతడి క్రికెట్ జర్నీని చూస్తే

Amir Hussain Lone Jammu Kashmir Cricketer

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 11:08 AM IST

Updated : Jan 13, 2024, 12:53 PM IST

Amir Hussain Lone Jammu Kashmir Cricketer : క్రికెట్ అంటే ఓ క్రీడ కాదు ఎంతో మందికి అది ఓ ఎమోషన్​ అని మనం చాలా సార్లు వింటుంటాం. దానికి తగ్గట్లుగానే క్రీడల్లోనూ క్రికెట్​కు సెపరేట్ ఫ్యాన్​ బేస్ ఉంది. ఈ బ్యాట్​ బాల్ గేమ్​ను వీక్షించేందుకు ప్రపంచంలోని కొన్ని కోట్లాదిమంది ఎదురుచూస్తుంటారు. టీవీల్లో, క్రికెట్ స్టేడియంలో చూస్తూ సందడి చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఈ క్రికెటర్లను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని ఈ గేమ్​లోకి ఎంట్రీ ఇస్తుంటారు. అలా వచ్చి సక్సెస్ సాధించిన వాళ్లు చాలా మంది ఉన్నారు.

అయితే క్రికెట్‌ ఆడాలంటే రెండు చేతులు ఉండాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయాలంటే చేతులు తప్పనిసరి. అది అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది మాత్రం సవాళ్లను ఎదుర్కొని ఒక్క చేయితో కూడా ఆడినవారు ఉన్నారు. కానీ రెండు చేతులు లేకుండా క్రికెట్‌ ఆడేస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాడు జమ్ము కశ్మీర్‌కు చెందిన అమీర్‌ హుస్సేన్‌. అయితే తను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నాడు. ఓ సారి అతడి క్రికెట్ జర్నీని చూస్తే

8 ఏళ్ల వయసులోనే తండ్రి మిల్లులో జరిగిన ఓ ప్రమాదం కారణంగా అమీర్‌ తన రెండు చేతులను కోల్పోయాడు. కానీ అతడు ఏ మాత్రం కుంగిపోలేదు. నిరాశతో అక్కడే ఆగిపోలేదు. తనలోని ట్యాలెంట్​ను ఓ ఉపాధ్యాయుడు గుర్తించి ప్రోత్సహించడం వల్ల క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చేతులు లేకున్నా మెడ, భుజాన్ని సాయంగా తీసుకుని బ్యాట్‌ పట్టుకుని బ్యాటింగ్‌ చేస్తున్నాడు. షాట్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చేతితో తిప్పి వేసినట్లుగానే కుడి కాలి వేళ్ల మధ్య బంతిని పెట్టుకుని బౌలింగ్‌ వేస్తున్నాడు. అలా బ్యాటింగ్​తోనే కాకుండా బౌలింగ్​లోనూ రాణిస్తున్నాడు.

  • #WATCH | Anantnag, J&K: 34-year-old differently-abled cricketer from Waghama village of Bijbehara. Amir Hussain Lone currently captains Jammu & Kashmir's Para cricket team. Amir has been playing cricket professionally since 2013 after a teacher discovered his cricketing talent… pic.twitter.com/hFfbOe1S5k

    — ANI (@ANI) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అలా తన కెరీర్​ను మలుచుకుంటూ ఎన్నో మెలుకువలు నేర్చుకున్న అమీర్ 2013 నుంచి ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఇప్పుడు జమ్ము కశ్మీర్‌ పారా క్రికెట్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇక 2013, 2018లో జాతీయ టోర్నీలో ఆడాడు. బంగ్లాదేశ్‌పై జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ అమీర్ ప్రాతినిథ్యం వహించాడు. నేపాల్‌, షార్జా, దుబాయ్‌లోనూ ఈ సూపర్ స్టార్ మ్యాచ్​లు ఆడాడు. సచిన్‌, కోహ్లీలను అమితంగా ఆరాధించే అమీర్‌ ఎప్పటీకైనా ఈ ఇద్దరిని కలవాలని కోరుకుంటున్నాడు. ఇటీవలే తనపై బాలీవుడ్‌లో ఓ సినిమాను రూపొందిస్తున్నట్లు అమీర్‌ వెల్లడించాడు.

" ఆ ప్రమాదం తర్వాత నేను నా నమ్మకాన్ని కోల్పోలేదు. కష్టపడ్డాను. ఎవరిపై ఆధారపడకుండానే నా పనులన్నింటినీ నేనే చేసుకుంటాను. విదేశాల్లో ఆడాను. కాలితో బౌలింగ్‌, భుజం, మెడ సాయంతో బ్యాటింగ్‌ చేస్తుంటే నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. క్రికెట్‌ ఆడేలా శక్తినిచ్చిన ఆ దేవుడికి ధన్యవాదాలు. కాలితో బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. కానీ ఆ స్కిల్స్​పై పట్టు సాధించాను" అంటూ అమీర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

మహిళా క్రికెటర్​ అరుదైన ఘనత - ఆ రికార్డును అందుకోనున్న తొలి ఆస్ట్రేలియా ప్లేయర్​ ఈమె

భారత్ అంధుల క్రికెట్ కెప్టెన్ అజయ్ కుమార్​రెడ్డి​కి అర్జున అవార్డు

Last Updated : Jan 13, 2024, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.