ETV Bharat / sports

మ్యాచ్​ మధ్యలో క్రికెటర్​ అంబటి రాయుడు ఫుల్​ ఫైర్​!.. ఏం జరిగింది? - అంబటిరాయుడు గొడవ

సయ్యద్‌ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా షెల్డన్‌ జాక్సన్‌, రాయుడు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ambati rayudu and sheldon jackson involved in heated exchange

author img

By

Published : Oct 13, 2022, 8:11 AM IST

సీనియర్‌ క్రికెటర్ అంబటి రాయుడుది మైదానంలో దూకుడుగా ఉండే స్వభావం. అయితే ఆ దూకుడే రాయుడుకు కొన్నిసార్లు చేటు తెచ్చేలా చేస్తుంది. తాజాగా సయ్యద్‌ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా షెల్డన్‌ జాక్సన్‌, రాయుడు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. బరోడా తరఫున అంబటి రాయుడు ఆడుతుండగా.. షెల్డన్‌ జాక్సన్‌ సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

షెల్డన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో రాయుడు ఏదో చెబుతుండగా.. వారి మధ్య చిన్నపాటి వాదులాట చోటుచేసుకుంది. అయితే అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యంచేసుకొని వారికి సర్దిచెప్పారు. అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.