ETV Bharat / sports

వరల్డ్​ కప్​ హీరోకు అరుధైన వ్యాధి.. ఇకపై సెంచరీ కొట్టలేనంటూ ఎమోషనల్​.. - allan border parkinsons disease

Allan border disease : ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ షాకింగ్ విషయాన్ని తెలిపాడు. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాడు.

Allan Border
వరల్డ్​ కప్​ హీరోకు అరుధైన వ్యాధి.. ఇకపై సెంచరీ కొట్టలేనంటూ ఎమోషనల్​..
author img

By

Published : Jul 1, 2023, 10:55 AM IST

Updated : Jul 1, 2023, 11:01 AM IST

allan border disease : ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తాను పార్కిన్సన్స్‌ అనే వ్యాధితో చాలా కాలం నుంచి బాధపడుతున్నట్లు తెలిపాడు. తొలిసారి ఈ విషయాన్ని చెప్పాడు. ఏడేళ్ల క్రితమే ఈ వ్యాధి బారిన తాను పడ్డానని, కానీ ఎవరూ తనపై జాలి చూపించకూడదనే ఇప్పటి వరకు విషయాన్ని దాచి పెట్టినట్టు వెల్లడించాడు. కాగా, ఈ వ్యాధి.. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రారంభ దశలో నరాలు దెబ్బ తినడం వల్ల చేతులు, కాళ్లు, దవడలు, మెడ వంటి అవయవాలు వణకడం ప్రారంభం అవుతుంది. ఫలితంగా శారీరక కదలికలు సాధారణంగా ఉండకపోవడం ఈ రోగం లక్షణం.

allan border parkinson's disease : " నేను ఓ న్యూరోసర్జర్‌ను కలిశాను. అతడు ఎలాంటి మొహమాటం లేకుండా నాకు పార్కిన్సన్ వ్యాధి వచ్చిందని చెప్పాడు. ఎప్పటిలాగే నడుస్తూ ఉండమని సూచించాడు. చేతులు కిందకి పెట్టుకోవచ్చు కానీ.. దానీ ఊపకూడదని అన్నాను. అలా నేను ఈ పార్కిన్సన్స్‌ అనే వ్యాధితో ఏడేళ్ల నుంచి బాధపడుతున్నాను. ఈ రోగం వచ్చిందని తెలిస్తే అందరూ ఎలా స్పందిస్తారో తెలీదు. బాధపడతారా లేదా ఓదారుస్తారా అనేది చెప్పలేం. అయితే ఎప్పుడో ఒకసారి ఇది తెలుస్తుంది. అందుకే ఇప్పుడు చెబుతున్నాను" అని బోర్డర్‌ చెప్పారు.

allan border stats : కాగా, 68 ఏళ్ల బోర్డర్‌.. తాను 80 ఏళ్లు జీవించగలిగితే దాన్ని చాలా గొప్పగా భావిస్తానని అన్నాడు. తాను మరో ‘సెంచరీ కచ్చితంగా సాధించలేనని అంటూ భావోద్వేగంతో పోస్ట్ రాసుకొచ్చాడు. అతడు తన కెరీర్​లో 156 టెస్టులు ఆడి 11,174 పరుగులు చేశాడు. అలాగే 273 వన్డేల్లో 6524 పరుగులు సాధించాడు. మొత్తంగా రెండు ఫార్మాట్‌లలో కలిపి 30 శతకాలు, 99 అర్ధ శతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి నాయకత్వంలోనే ఆ్రస్టేలియా 1987లో మొదటి సారి వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడింది.

ఇకపోతే అలెన్ బోర్డర్ టీమ్​మేట్​.. డీన్ జోన్స్ కూడా పార్కిన్సన్ వ్యాధితోనే బాధపడ్డారు. 2020లో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఇక ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్, ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ముగ్గురూ.. గతేడాదే తమ ప్రాణాలు కోల్పోయారు. షేన్ వార్న్.. థాయ్‌లాండ్‌లోని తన రిసార్ట్‌లో గుండెపోటు తుదిశ్వాస విడవగా.. ఆండ్రూ సైమండ్స్ కార్​ యాక్సిడెంట్​లో అక్కడికక్కడే తన ప్రాణాలను కోల్పోయాడు.

ఇదీ చూడండి :

డైమండ్‌ లీగ్‌లో సత్తా చాటిన నీరజ్‌ చోప్రా.. అగ్రస్థానం కైవసం

'ప్లేయర్స్​పై వర్క్​లోడ్​ తగ్గించడమా? అది సాధ్యమయ్యే పని కాదు'

Last Updated : Jul 1, 2023, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.