ETV Bharat / sports

​ వన్డే చరిత్రలో తొలి వికెట్‌ టేకర్​.. మాజీ ఫాస్ట్​ బౌలర్​ మృతి - మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్‌ అలాన్‌ థామ్సన్ మరణం

వన్డే చరిత్రలో తొలి వికెట్​ తీసిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్(76) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

First ODI wicket keeper alan thomson died
​ వన్డే చరిత్రలో తొలి వికెట్‌ టేకర్​.. మాజీ ఫాస్ట్​ బౌలర్​ మృతి
author img

By

Published : Nov 2, 2022, 12:44 PM IST

వన్డే చరిత్రలో తొలి వికెట్‌ టేకర్‌.. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్(76) తదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుముశారు. ఈ విషయాన్ని అతని తమ్ముడు ట్విటర్‌ ద్వారా తెలిపాడు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

"మా అన్నయ్య, మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్‌ అలాన్‌ థామ్సన్ మరణించారు. కొన్ని రోజులు కిందట అతనికి హిప్‌ సర్జరీ జరిగింది. కానీ అన్నయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగపడలేదు. అఖరికి అలాన్‌ మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు" అని అతడి సోదరుడు ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, విక్టోరియాకు చెందిన అలాన్‌ ఆస్ట్రేలియా తరపున కేవలం ఒక వన్డే, నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడారు. నాలుగు టెస్టుల్లో 12 వికెట్లు అలాన్‌ సాధించారు. అదే విధంగా అతని బౌలింగ్‌ యాక‌్షన్‌ కూడా అందరికంటే భిన్నంగా ఉంటుంది. అందుకే అతనిని ముద్దుగా "ఫ్రాగీ" అని పిలుచుకునేవారు. ఇక ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో విక్టోరియా తరపున 44 ‍మ్యాచ్‌లు ఆడిన అలాన్‌.. 184 వికెట్లు పడగొట్టారు.

వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలి వికెట్‌.. ప్రపంచ వన్డే క్రికెట్‌ చరిత్రలో 1971 జనవరి 5న ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన అలాన్‌ థామ్సన్ తొలి వికెట్​ తీశారు. తద్వారా వన్డేల్లో తొలి వికెట్‌ సాధించిన బౌలర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అలాన్‌ 22 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ సాధించారు.

alan thomson
అలాన్ థామ్సన్

ఇదీ చదవండి: T20 worldcup: బంగ్లాదేశ్​తో మ్యాచ్​కు రెడీ.. టీమ్​ఇండియాకు అదొక్కటే సమస్య

T20 worldcup: అదే కనుక జరిగితే టీమ్​ఇండియాకు బిగ్​ టెన్షనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.