ETV Bharat / sports

IND vs SL: 'మూడో టీ20లో ధావన్​, శాంసన్​ కీలకం'

శ్రీలంకతో జరగనున్న మూడో టీ20లో ధావన్​, సంజు శాంసన్​ పరుగులు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశాడు ఆకాశ్​ చోప్రా. రెండో టీ20లో జట్టు తక్కువ పరుగులు చేసిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

Dhawan
ధావన్​
author img

By

Published : Jul 29, 2021, 6:16 PM IST

కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌, వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మద్దతుగా నిలిచాడు. మూడో టీ20లో వీరిద్దరూ పరుగులు చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు. మ్యాచులో వీరిద్దరే కీలకం అవుతారని, రుతురాజ్‌, పడిక్కల్‌ చేసే పరుగులు బోనస్‌ అవుతాయని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టుకు ఎలా ముగించాలో ఇంకా తెలియదని వెల్లడించాడు.

'ఆఖరి టీ20లో భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌కు శిఖర్‌ ధావన్‌, సంజూ శాంసన్‌ మూల స్తంభాలు. ఇక రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌, నితీశ్‌ రాణా చేసే పరుగులు బోనస్‌. ధావన్‌, సంజు మెరుగైన స్కోర్‌ చేశారంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆఖరి గీత ఎలా దాటాలో ఈ శ్రీలంక జట్టుకు తెలియదు. రెండో టీ20లోనూ వారు ఇబ్బంది పడ్డారు' అని ఆకాశ్‌ చోప్రా వెల్లడించాడు.

రెండో టీ20లో టీమ్‌ఇండియా తక్కువ పరుగులకే పరిమితమైంది. 20 ఓవర్లు ఆడిన గబ్బర్‌సేన 132/5 పరుగులే చేసింది. ధావన్‌ (40), రుతురాజ్‌ (21), దేవదత్‌ (29) మినహా మరెవ్వరూ భారీ పరుగులు చేయలేదు. ఇక లంక కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తడబడింది. కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని పరీక్షించారు. ఆఖరి ఓవర్లో గానీ ఆ జట్టుకు విజయం లభించలేదు.

ఇదీ చూడండి:- 'అలా చేస్తే బుమ్రా పని ఖతం.. జాగ్రత్త పడాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.