ETV Bharat / sports

ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​ టెస్టులో బౌలర్ల విధ్వంసం.. తొలి రోజే 17 వికెట్లు

Eng vs NZ: ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో 132 పరుగులకే కుప్పకూలింది కివీస్ జట్టు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లిష్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 116 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

eng first test
ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​ టెస్టులో బౌలర్ల విధ్వంసం
author img

By

Published : Jun 3, 2022, 7:07 AM IST

Eng vs Nz first test: న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మొదలైంది. మంచి ఆరంభాన్ని ఇంగ్లిష్‌ జట్టు వృథా చేసుకుంది. గురువారం లార్డ్స్‌లో ప్రారంభమైన మ్యాచ్‌లో అరంగేట్ర పేసర్‌ మాథ్యూ పాట్స్​తో (4/13) పాటు అండర్సన్‌ (4/66) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 132 పరుగులకే కుప్పకూలింది. గ్రాండ్‌హోమ్‌ (42 నాటౌట్‌) నిలబడకపోయింటే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు లీస్‌ (25), క్రాలీ (43) అదిరే ఆరంభం ఇచ్చారు. 59 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన అనంతరం మిగతా బ్యాటర్లంతా పెవిలియన్​కు క్యూ కట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 116 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో జేమీసన్‌ (2/20), బౌల్ట్‌ (2/15), సౌథీ (2/40) ఇంగ్లాండ్‌ను దెబ్బతీశారు. ఆట ముగిసే సమయానికి బెన్‌ ఫోక్స్‌ (6), బ్రాడ్‌ (4) క్రీజులో ఉన్నారు.

eng first test
ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​ టెస్టులో బౌలర్ల విధ్వంసం

లార్డ్స్​ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో కివీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే ఆలౌట్​ అయింది. మరోవైపు ఇంగ్లిష్ జట్టు కెప్టెన్ బెన్​ స్టోక్స్​ పూర్తి స్థాయి సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. తొలి రోజు ఆతిథ్య జట్టే పైచేయి సాధించినప్పటికీ రెండో రోజు మ్యాచ్​ ఎలా మలుపుతిరుగుతుందో చూడాలి.

ఇదీ చదవండి: IPL 2022: చర్చంతా కోహ్లీ, ఆర్సీబీ గురించే.. నెటిజన్ల రచ్చ రచ్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.