Ravi Shastri on Chahal Incident: టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు కొన్నేళ్ల కింద ఎదురైన ఘటనపై పలువురు క్రికెట్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఐపీఎల్లో తాను ముంబయి ఇండియన్స్‌కు ఆడే తొలి రోజుల్లో ఓ ప్లేయర్ తప్పతాగి తనను 15వ అంతస్తు నుంచి వేలాడదీశాడని చాహల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కొంచెెం అటూఇటైనా తను కింద పడిపోయేవాడినని అన్నాడు. దీనిపై స్పందించిన టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.. ఆ నేరానికి పాల్పడిన క్రికెటర్ సమీప భవిష్యత్తులో మైదానంలోకి అడుగుపెట్టనీయొద్దని సూచించాడు. ఇది చిన్న విషయం ఏమాత్రం కాదని అన్నాడు.
''ఇలాంటి ఘటనను చూడటం నాకు ఇదే తొలిసారి. ఇది చిన్న విషయం కాదు. చాహల్‌కు ఎదురైనటువంటి ఘటన ఈ రోజుల్లో జరిగితే.. ఆ వ్యక్తిపై జీవితకాల నిషేధం పడేది. వీలైనంత తొందరగా పునరావాస శిబిరానికి పంపేవారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో నాకు తెలియదు. అతడు ఏ స్థితిలో ఉన్నాడో నాకు తెలియదు. కానీ.. ఒకరి జీవితం ప్రమాదంలో ఉంటే అది ఎప్పటికీ ఫన్నీ కాదు.''
- రవిశాస్త్రి, టీమ్ఇండియా మాజీ కోచ్
రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన వీడియోలో సహచరుడు అశ్విన్‌తో కలిసి తన అనుభవాలను పంచుకున్నాడు చాహల్. 2013 ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున చాహల్ ఆడుతున్నప్పుడు తన జీవితంలో జరిగిన భయానక సంఘటన గురించి వివరించాడు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో ఓ ఆటగాడు ఫుల్‌గా మద్యం తాగి 15వ అంతస్తు నుంచి తనను తలకిందులుగా వేలాడదీశాడని చాహల్ ఈ వీడియోలో తెలిపాడు. అతడి పేరు మాత్రం చాహల్ చెప్పలేదు. ఈ ఘటనపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. ఆ ఆటగాడి పేరు చెప్పాలని అన్నాడు.
-
Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV
— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV
— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV
— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022
ఇవీ చూడండి: సక్సెస్ మంత్రం చెప్పిన గిల్.. తెవాతియాపై ప్రశంసలు!