టీ20 ప్రపంచకప్(t20 worldcup 2021)లో భాగంగా షార్జా వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ అదరగొట్టింది(Afg vs Sco T20).. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. స్కాట్లాండ్పై 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 10.2 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. స్కాట్లాండ్ బ్యాటర్లలో జార్జ్ మున్సీ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా విఫల కావడం వల్ల స్కాట్లాండ్ ఘోర పరాజయం పాలైంది. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ముజిబుర్ రెహ్మాన్ ఐదు, రషీద్ ఖాన్ నాలుగు, నవీన్-ఉల్-హక్ ఒక వికెట్ తీశారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ నజీబుల్లా జద్రాన్ (59) అర్ధ శతకంతో రాణించడం వల్ల.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రాతుల్లా జజాయి (44), మహమ్మద్ షెహజాద్ (22) జట్టుకు శుభారంభం అందించారు. వేగంగా ఆడే క్రమంలో షెహజాద్ షరీఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహ్మానుల్లా (46)తో కలిసి మరో ఓపెనర్ హజ్రాతుల్లా ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే మార్క్ వాట్ వేసిన పదో ఓవర్లో హజ్రాతుల్లా బౌల్డయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన నజీబుల్లా జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ నిలకడగా ఆడుతూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. 19 ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రహ్మానుల్లా క్యాచ్ ఔటై క్రీజు వీడాడు. షరీఫ్ వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతికి నజీబుల్లా జద్రాన్ ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన కెప్టెన్ మహమ్మద్ నబీ (11) నాటౌట్‌గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో షరీఫ్ రెండు, మార్క్ వాట్, జోష్ డేవీ తలో వికెట్ తీశారు.