Afg Vs SL Asia Cup 2023 : ఆసియా కప్‌లో సూపర్-4 బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్ ఇప్పటికే సూపర్-4కు చేరగా గ్రూప్-బి లో బంగ్లాదేశ్, శ్రీలంక అడుగుపెట్టాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక జట్టు 2 పరుగుల తేడాతో అతి కష్టం మీద గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.
లంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్ 92 పరుగులతో రాణించాడు. తర్వాత 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ జట్టు 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ధాటిగా బ్యాటింగ్ చేసినప్పటికీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం వల్ల అఫ్గానిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు సూపర్-4లో భాగంగా ఇవాళ పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.
Afganistan Vs Srilanka Asia Cup 2023 : సూపర్-4కు చేరుకునేందుకు 292 లక్ష్యాన్ని 37.1 ఓవర్లలో ఛేదించాల్సిన అఫ్గాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రహ్మనుల్లా గుర్బాజ్ (4), ఇబ్రహీం జాద్రాన్ (7) త్వరగా ఔటవ్వగా.. 9 ఓవర్లకు 52/3తో ఆ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో హష్మతుల్లా షాహిదీ, రహ్మత్‌షా (45) మైదానంలోకి దిగి ఇన్నింగ్స్ నిలబెట్టారు. అయితే 18 ఓవర్లకు 120/3తో అఫ్గాన్ లక్ష్యం దిశగా సాగింది. రహ్మత్ తర్వాత మహ్మద్ నబి దూకుడుగా ఆడటం వల్ల అఫ్గాన్ స్కోరు పరుగులెత్తింది. కానీ కాసేపు తర్వాత తడబడిన అఫ్గాన్.. 237/7తో పరాజయం ముంగిట నిలిచింది.
మరోవైపు సూపర్-4కు అర్హత సాధించాలంటే 31 బంతుల్లో 54 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్, నజీబుల్లా జాద్రాన్ (23; 15 బంతుల్లో 1×4, 2×6) హోరా హోరీగా ఆడి మ్యాచ్‌పై ఆశలు రేపారు. అయితే నజీబుల్లా ఔటైనప్పటికీ.. రషీద్‌ఖాన్ ఉండటం వల్ల అఫ్గాన్‌కు ఇంకా ఆశలు ఉన్నాయి. ఇక 6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన స్థితిలో రషీద్ మూడు ఫోర్లే కొట్టడం వల్ల అఫ్గాన్ 37 ఓవర్లకు 289/8తో నిలిచింది.
ఇక 38వ ఓవర్ తొలి బంతికి 3 పరుగులు చేస్తే అఫ్గాన్ లీడ్‌లో ఉండేది. కానీ ఆ బంతికి ముజీబ్ ఔటైపోయాడు. దీంతో ఇక అఫ్గాన్ కథ ముగిసిందనే అనుకున్నారు. కానీ రన్‌రేట్ సమీకరణాల ప్రకారం ఆ ఓవర్ నాలుగో బంతి లోపు అఫ్గాన్ స్కోరు 295కు చేరినా ఆ జట్టు గెలిచేదని తేలింది. కానీ ఈ విషయం క్రీజులో ఉన్న బ్యాటర్లకు తెలియలేదు. రెండో బంతికి ఫారూఖీ సింగిల్ తీసి రషీద్‌కు స్ట్రైకింగ్ ఇచ్చినా.. అతను తర్వాతి 2 బంతుల్లో 6 పరుగులు కొట్టేసేవాడేమో. కానీ 2 బంతులు వృథా చేసిన ఫారూఖీ నాలుగో బంతికి ఔటైపోవడంతో అఫ్గాన్ పనైపోయింది.
-
Sri Lanka clinches a thrilling victory by just 2 runs and secures the spot in the #AsiaCup2023 super four round!#LankanLions #SLvAFG pic.twitter.com/E223jJZSlG
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sri Lanka clinches a thrilling victory by just 2 runs and secures the spot in the #AsiaCup2023 super four round!#LankanLions #SLvAFG pic.twitter.com/E223jJZSlG
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 5, 2023Sri Lanka clinches a thrilling victory by just 2 runs and secures the spot in the #AsiaCup2023 super four round!#LankanLions #SLvAFG pic.twitter.com/E223jJZSlG
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 5, 2023
Highest Team Score In Asia Cup : మినీ టోర్నీలో రికార్డులు.. ఆసియా కప్‌లో అత్యధిక స్కోరు ఆ జట్టుదే..