Aakash Chopra Comments On Test Cricket: టీమ్ఇండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా టెస్టు క్రికెట్ ప్రస్తుతం ఐసీయూ (ICU)లో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఫార్మాట్‌ను వెంటిలేటర్‌పై ఉంచాలని అన్నాడు. సౌతాఫ్రికా టెస్టు క్రికెట్‌ను అవమానించేలా ప్రవర్తించిందని విమర్శలు వస్తున్న నేపథ్యలో ఆకాశ్ ఇలా స్పందించాడు. అయితే ఫిబ్రవరిలో సౌతాఫ్రికా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లను సౌతాఫ్రికా టెస్టు జట్టులో ప్రకటించడం ఈ విమర్శలకు కారణమైంది.
అయితే సౌతాఫ్రికా ప్రకటించిన 14 మంది బృందంలో సగం మంది అన్క్యాప్డ్ ప్లేయర్లే. మిగిలిన ఏడుగురిలో డేవిడ్ బెడింగమ్, కీగన్ పీటర్సన్ ఇద్దరూ రీసెంట్గా బాక్సింగ్ డే మ్యాచ్‌లోనే టెస్టు అరంగేట్రం చేశారు. ఈ లెక్కన జట్టులో ఐదుగురు మాత్రమే సీనియర్ ప్లేయర్లు ఉండడం వల్ల ఆకాశ్ సహా ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ స్టీవ్ వా సౌతాఫ్రికా బోర్డుపై మండిపడ్డారు. కేవలం సౌతాఫ్రికా టీ20 లీగ్ కోసమే ఇలా బోర్డు ఇలా చేసిందని, వారికి టెస్టు క్రికెట్ కంటే డొమెస్టిక్ లీగ్‌లు ఎక్కువైపోయాయని అన్నారు.
'టెస్టు క్రికెట్ ఐసీయూలో ఉంది. తక్షణమే ఈ ఫార్మాట్‌ను వెంటిలేటర్‌పై ఉంచాలి. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికా బీ గ్రేడ్ జట్టును అనౌన్స్ చేసింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భాగంగా జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల కంటే వారికి డొమెస్టిక్ లీగ్ ఎక్కువైపోయింది. అలా అయితే మర్క్రమ్ నుంచి రబాడా వరకు స్టార్ ప్లేయర్లందరినీ ఎస్పీఎల్ (SPL)కు ప్రిపేర్ చేసుకోండి. కుర్రాళ్లు టెస్టు క్రికెట్ ఆడతారు' అని ఆకాశ్ అన్నాడు.
మరోవైపు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ బోర్డు తమ జట్టు స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీకి రెస్ట్ ఇచ్చింది. త్వరలో ప్రారంభమయ్యే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (PSL), 2024 టీ20 వరల్డ్‌కప్ కోసమే బోర్డు ఇలా చేసినట్లు తెలుస్తోంది.
సౌతాఫ్రికా స్పందన: టెస్టు క్రికెట్‌పై తమకెంతో గౌరవం ఉందని సౌతాఫ్రితా బోర్డు స్పష్టం చేసింది. 'కివీస్‌తో టెస్టు సిరీస్ కన్ఫార్మ్ కాకముందే సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ నిర్వాహకులతో ఒప్పందం కుదిరింది. అందుకే వల్లే ఇలా చేయాల్సి వచ్చింది. ఈ సిరీస్ మినహా, డబ్ల్యూటీసీ మిగతా మ్యాచ్‌లకు ఇలా జరగకుండా చూసుకుంటాం' అని బోర్డు తెలిపింది.
-
🟢 SQUAD ANNOUNCEMENT 🟡
— Proteas Men (@ProteasMenCSA) December 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
CSA has today announced a 14-player squad for the Proteas two-match Test tour of New Zealand next month🇿🇦🇳🇿#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/pLBxCrNvJF
">🟢 SQUAD ANNOUNCEMENT 🟡
— Proteas Men (@ProteasMenCSA) December 30, 2023
CSA has today announced a 14-player squad for the Proteas two-match Test tour of New Zealand next month🇿🇦🇳🇿#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/pLBxCrNvJF🟢 SQUAD ANNOUNCEMENT 🟡
— Proteas Men (@ProteasMenCSA) December 30, 2023
CSA has today announced a 14-player squad for the Proteas two-match Test tour of New Zealand next month🇿🇦🇳🇿#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/pLBxCrNvJF
సమమా? సమర్పణమా?- సఫారీలతో రెండో టెస్ట్‌కు భారత్ రెడీ- తుది జట్ల వివరాలివే!
వార్నర్ బ్యాగ్ చోరీ- తిరిగివ్వాలని రిక్వెస్ట్- అందులో ఏముందంటే?