ETV Bharat / sports

HCA: కొత్త జిల్లాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటు - telangana varthalu

hca
కొత్త జిల్లాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటు
author img

By

Published : Jun 19, 2021, 5:42 PM IST

Updated : Jun 19, 2021, 7:38 PM IST

17:40 June 19

కొత్త జిల్లాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటు

కొత్త జిల్లాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటు
కొత్త జిల్లాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటు

రాష్ట్రంలో క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త ఏర్పడిన జిల్లాల నుంచి ఆరుగురు సభ్యులకు హెచ్‌సీఏలో సభ్యత్వం కల్పించింది. శరత్ చంద్ర, మఠం భిక్షపతి, బుద్దుల శ్రవణ్​ రెడ్డి, దాదన్నగారి సందీప్ కుమార్, దావ సురేష్, కల్కుంట్ల మల్లికార్జున్​లను హెచ్‌సీఏ ఏజీఎంలో సభ్యులుగా నియమించింది. వీరినే పలు జిల్లాల అడ్ హక్ కార్యదర్శులుగా నియమిస్తూ హెచ్​సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.  

నూతన అడ్ హక్ కార్యదర్శులు, సొసైటీస్ చట్టం ప్రకారం సంబంధిత జిల్లా క్రికెట్ అసోసియేషన్​లను, ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించనున్నారని హెచ్‌సీఏ ప్రకటించింది. రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్‌సీఏలో సభ్యుల సంఖ్యను పెంచి, అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్నదే లక్ష్యంగా కొత్త జిల్లాలకు సభ్యత్వం కల్పించినట్లు హెచ్​సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ తెలిపారు. తద్వారా మారుమూల ప్రాంతాల యువతకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, నైపుణ్యాలను పెంపొందించే అవకాశం కలుగుతుందన్నారు. 

ఇదీ చదవండి: మిల్కా సింగ్ అంత్యక్రియలు పూర్తి

Last Updated : Jun 19, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.