2024 T20 World Cup Logo : 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు సంబంధించి ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) కొత్త లోగోను గురువారం విడుదల చేసింది. 2024 జూన్‌లో పురుషుల, సెప్టెంబర్-అక్టోబర్ మధ్య మహిళల టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ క్రమంలో పురుషుల, మహిళల టోర్నీ లోగోలను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఐసీసీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ జీఎం క్లైయిర్ ఫర్లాంగ్ స్పందించారు.'అంతర్జాతీయంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి పురుషుల, మహిళల ప్రపంచ కప్‌లు సిద్ధమవుతున్నాయి. కొత్తగా ఆవిష్కరించిన లోగోలు ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
2024 ICC Men's T20 World Cup Host : 2024 వరల్డ్‌కప్ సంబరం మరో ఆరు నెలల్లో ప్రారంభం కానుంది. టోర్నీలో జూన్ 4 నుంచి 30 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం ఆయా జట్ల ఇప్పటికే సన్నద్ధత ప్రారంభించాయి. ఇక ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి యూఎస్, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక టోర్నీలో ఈ ఎడిషన్‌లో 20 జట్లు తలపడనున్నాయి. ఈ 20 జట్లను 5 గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
2024 T20 World Cup India : గత 13 ఏళ్లుగా ఐసీసీ టోర్నమెంట్లో ఛాంపియన్‌గా నిలవని టీమ్ఇండియా, పొట్టి కప్పును సీరియస్‌గా తీసుకుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటినుంచే జట్టలో కీలక మార్పులకు సిద్ధమైంది బీసీసీఐ. అయితే 2024 టీ20 వరల్డ్‌కప్‌నకు కూడా రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి జట్టులో కుర్రళ్లకు పెద్ద పీట వేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముడో స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను ఆడించాలని అనుకుంటుందట. ఇషాన్ కెరీర్లో ఇప్పటివరకు 32 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 124.37 స్ట్రైక్ రేట్‌తో 796 పరుగులు చేశాడు. దీంతో ఇషాన్ 2024 వరల్డ్‌కప్‌లో మూడో స్థానంలో కీ రోల్ ప్లే చేస్తాడని మేనేజ్మెంట్ భావిస్తోందట. కానీ, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
'నడవలేని స్థితి వరకు ఐపీఎల్ ఆడతా- ఏ ఆటగాడైనా కోరుకునే గొప్ప అనుభూతి అదే!'
బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ పొజిషన్ - తొలిసారి టాప్ ప్లేస్‌కు - టీ20 ర్యాంకింగ్స్ రిలీజ్