ETV Bharat / sports

2022 వన్డే వరల్డ్​కప్​ నా కెరీర్​లో చివరిది: మిథాలీ - mithali 2022 wc

భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్​ తన రిటైర్మెంట్​పై స్పష్టత ఇచ్చింది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్​కప్​ తన కెరీర్​లో చివరిదని వెల్లడించింది.

2022 World Cup will be my swansong, Mithali Raj
మిథాలీ రాజ్, భారత మహిళల వన్డే కెప్టెన్
author img

By

Published : Apr 24, 2021, 5:10 PM IST

Updated : Apr 24, 2021, 5:26 PM IST

న్యూజిలాండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్​ తన కెరీర్​లో చివరిదని వెల్లడించింది భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. '1971: ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్​ క్రికెటింగ్ గ్రేట్​నెస్​' పుస్తకావిష్కరణలో మిథాలీ పాల్గొన్నది. వరల్డ్​కప్​లో రాణించే సత్తా ఉన్న బౌలర్ల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది.

సుదీర్ఘ కాలంగా భారత మహిళల క్రికెట్​కు ప్రాతినిధ్యం వహించిన మిథాలీ.. ఇక ఆటకు గుడ్​ బై చెప్పాలని భావిస్తోంది. తాను అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టి గతేడాదికి 20 ఏళ్లు పూర్తైందని తెలిపింది. భారత్ తరఫున 7000 పరుగులు సాధించిన ఏకైక మహిళ క్రికెటర్​ మిథాలీయే కావడం విశేషం.

ఇదీ చదవండి: 'కొవిడ్​ నుంచి కోలుకున్నా.. త్వరలోనే ప్లాస్మా దానం చేస్తా'

"నేను అంతర్జాతీయ క్రికెట్​లోకి వచ్చి ఇప్పటికే 21 ఏళ్లైంది. 2022 వన్డే వరల్డ్​కప్ నా కెరీర్​లో చివరిదవుతుందని నాకు తెలుసు. టీమ్​లో ప్రస్తుతమున్న జులాన్ గోస్వామి కెరీర్​ చివరిలో ఉంది. కాబట్టి అత్యుత్తమ ఫాస్ట్​ బౌలర్లు కోసం చూస్తున్నాం. ప్రపంచకప్​ నాటికి ఈ సమస్యను అధిగమించాలి. వరల్డ్​కప్​కు ముందు మేము నాలుగు దేశాల్లో పర్యటించనున్నాం. అందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ​ప్రస్తుతం కొవిడ్ కష్టకాలంలో ఉన్నాం. నా వయసు పెరుగుతున్నా ఫిట్​నెస్​పై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి ఉంటుంది."

-మిథాలీ రాజ్​, భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్.

ఇదీ చదవండి: హైదరాబాద్ రంజీ ప్లేయర్​ అశ్విన్ యాదవ్ మృతి

Last Updated : Apr 24, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.