ETV Bharat / sports

'ఆ క్యాచ్​ ఇచ్చినందుకు మిస్బాకు థ్యాంక్స్ చెప్పాలి' - శ్రీశాంత్ మిస్బా వుల్ హక్

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్​(2007 world cup final) మ్యాచ్​లో పాకిస్థాన్​పై గెలిచి ట్రోఫీని ముద్దాడింది టీమ్ఇండియా. ఈ మ్యాచ్​లో చివరి బంతికి పాక్ బ్యాట్స్​మన్ మిస్బా ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్​ను ఒడిసిపట్టి భారత్​కు విజయాన్ని అందించాడు పేసర్ శ్రీశాంత్(sreesanth t20 world cup). ఈ మరపురాని మ్యాచ్​కు శుక్రవారంతో 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించాడు శ్రీశాంత్.

T20 World Cup
టీ20
author img

By

Published : Sep 25, 2021, 4:15 PM IST

Updated : Sep 25, 2021, 4:52 PM IST

2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌(2007 world cup final)లో మిస్బాల్ ఉల్‌ హక్‌ క్యాచ్(misbah ul haq career) గురించి అసలు అలోచించలేదని టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ శ్రీశాంత్‌(sreesanth t20 world cup) తాజాగా వెల్లడించాడు. అప్పుడు ఫైనల్స్‌లో భారత్‌.. మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వంలో పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించిన ట్రోఫీ ముద్దాడింది. అది జరిగి శుక్రవారం నాటికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నాటి చిరస్మరణీయ క్యాచ్‌ అందుకున్న శ్రీశాంత్‌(sreesanth t20 world cup) తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పాడు. అప్పుడు తాను క్యాచ్‌ గురించి ఆలోచించలేదన్నాడు.

"జోగిందర్‌ చివరి ఓవర్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు తొలి బంతి వైడ్‌గా వెళ్లింది. రెండో బంతిని మిస్బా సిక్స్‌గా మలిచాడు. దీంతో మాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో నా వద్దకు బంతి వస్తే పాకిస్థాన్‌కు సింగిల్‌ మాత్రమే ఇవ్వాలని రెండో పరుగు ఇవ్వకూడదని అనుకున్నా. అప్పుడసలు క్యాచ్‌ గురించే ఆలోచించలేదు. చివరికి మిస్బా(misbah ul haq career) ఆడిన మూడో బంతి గాల్లోకి పైకి వెళ్లగా నేను రెండు మూడు అడుగులు వెనక్కి వెళ్లా.. దీంతో బంతి నేరుగా వచ్చి నా చేతుల్లో పడింది. అయితే, అప్పుడా బంతి చేజారినట్లు అనిపించినా రెండోసారి గట్టిగా ఒడిసిపట్టా" అని శ్రీశాంత్‌(sreesanth t20 world cup) వివరించాడు.

Sreesanth
శ్రీశాంత్, ధోనీ

కాగా, అలాంటి ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ఎవరూ బంతి తమ వద్దకు రావాలని కోరుకోరని, ముఖ్యంగా భారత్‌-పాకిస్థాన్‌ లాంటి అత్యంత కీలకమైన మ్యాచ్‌లో అసలు ఊహించరని శ్రీశాంత్‌(sreesanth t20 world cup) పేర్కొన్నాడు. కానీ, అప్పుడు తనని షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌కు ఉంచిన కెప్టెన్‌ ధోనీకి రుణపడి ఉంటానని చెప్పాడు. బంతి చాలా అరుదుగా వచ్చే ఫీల్డింగ్‌ పొజిషన్‌ అది అని, అలాంటి షాట్‌ ఆడిన మిస్బా ఉల్‌ హక్‌(misbah ul haq career)కు కూడా థ్యాంక్స్ చెప్పాలని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ అభిప్రాయపడ్డాడు.

ఇక ఈ మ్యాచ్‌(2007 world cup final)లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 157/5 స్కోర్‌ సాధించగా పాకిస్థాన్‌ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. మిస్బా చివర్లో స్కూప్‌ షాట్‌ ఆడటం వల్ల బంతి గాల్లోకి వెళ్లి శ్రీశాంత్‌(sreesanth t20 world cup)కు చేతుల్లో పడింది. అంతే యావత్ భారతదేశం విజయోత్సవాల్లో మునిగిపోయింది.

ఇవీ చూడండి: టీ20 ప్రపంచకప్​ రికార్డుకు 14ఏళ్లు.. ఆ విశేషాలివే

Last Updated : Sep 25, 2021, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.