ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌కు దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. అనంతరం వీరిద్దరూ కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజును కలిశారు.
రూ.10 లక్షల నజరానా...
చారిత్రక విజయంపై సింధును కిరణ్ రిజిజు అభినందించారు. కేంద్రం తరఫున ప్రోత్సాహకంగా 10 లక్షల రూపాయల చెక్ అందించారు. ఈ టోర్నీలో కాంస్యం గెలిచిన సాయి ప్రణీత్నూ ప్రశంసించారు రిజిజు. అతడికి 4 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు.
మోదీతో ముఖాముఖి...
ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు సింధు, కోచ్ గోపీచంద్. ఇద్దరినీ మోదీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఈ ఫొటోలను ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ‘
"బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా" అని మోదీ ట్వీట్ చేశారు.
కొత్త చరిత్ర...
భారత స్టార్ క్రీడాకారిణి సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఐదో సీడ్ సింధు 21-7,21-7తో మూడో సీడ్ నొజొమి ఒకుహర(జపాన్)ను చిత్తు చేసింది.
ఇవీ చూడండి.. ప్రధాని మోదీని కలిసిన పీవీ సింధు