ETV Bharat / sports

షట్లర్ గుత్తా జ్వాల-విష్ణు విశాల్ పెళ్లి త్వరలో - గుత్తా జ్వాల మ్యారేజ్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, విష్ణు విశాల్ వివాహం త్వరలో జరగనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు సదరు నటుడు.

Vishnu Vishal confirms marriage with Jwala Gutta soon
షట్లర్ గుత్తా జ్వాల-విష్ణు విశాల్ పెళ్లి
author img

By

Published : Mar 24, 2021, 6:14 AM IST

Updated : Mar 24, 2021, 8:20 AM IST

బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే వరుడు, తమిళ నటుడు విష్ణు విశాల్ ఇటీవల స్పష్టం చేశాడు.

"జ్వాల నాకెప్పుడూ మద్దతుగా నిలుస్తూనే ఉంది. ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటుంది. ఆమెకు ధన్యవాదాలు. అతి త్వరలోనే మేం పెళ్లి చేసుకోబోతున్నాం. నేను తెలుగు అల్లుడిని కాబోతున్నా. అందుకు చాలా సంతోషంగా ఉంది" అని ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో విష్ణు విశాల్ పేర్కొన్నాడు.

కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జోడీ, గతేడాది సెప్టెంబర్​లో నిశ్చితార్థం చేసుకున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు తన సొంతనిర్మాణ సంస్థలో జ్వాల జీవిత కథను సినిమాగా తీస్తానని విశాల్ ప్రకటించాడు.

Vishnu Vishal Jwala Gutta marriage
గుత్తా జ్వాల-విష్ణు విశాల్

Last Updated : Mar 24, 2021, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.