ETV Bharat / sports

సైనా, శ్రీకాంత్​.. ఒలింపిక్స్​ ఆశలు ఆవిరి

భారత స్టార్​ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్​.. ఒలింపిక్స్​ ఆశలు ఆవిరయ్యాయి. మెగా ఈవెంట్​కు ముందు ఎలాంటి అర్హత టోర్నీలు ఉండవని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(BWF) స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరూ ఒలింపిక్స్​లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు.

saina nehwal, kidambi srikanth
సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్
author img

By

Published : May 28, 2021, 3:57 PM IST

Updated : May 28, 2021, 6:29 PM IST

భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్​.. టోక్యో ఒలింపిక్స్​ ఆశలు ఆవిరయ్యాయి. ఒలింపిక్స్​కు ముందు బ్యాడ్మింటన్​లో షెడ్యూల్​కు మించి ఎలాంటి టోర్నీలు ఉండవంటూ.. ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్​కు ముందు ఉన్న చివరి అర్హత టోర్నీ సింగపూర్​ ఓపెన్​ రద్దు కావడం వల్ల వీరిద్దరూ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.

ఒలింపిక్స్​కు ముందు మరోసారి ప్రకటన విడుదల చేస్తామని బీడబ్ల్యూఎఫ్​ గతంలో చెప్పింది. దీంతో ఏదైనా అవకాశం ఉంటుందని ఈ ఇద్దరూ భావించారు. కానీ, అటువంటి అర్హత టోర్నీలేమీ ఉండబోవని తాజాగా బ్యాడ్మింటన్ సమాఖ్య స్పష్టం చేసింది.

"టోక్యో ఒలింపిక్స్​కు ముందు అర్హత విభాగంలో మరే టోర్నీ ఉండబోదని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య స్పష్టం చేసింది. జూన్​ 15 వరకు ఇందుకు సమయం ఉన్నప్పటికీ చివరగా జరగాల్సిన మూడు టోర్నీలు కొవిడ్ కారణంగా రద్దయ్యాయి. దీంతో షట్లర్ల ర్యాంకుల్లోనూ ఎటువంటి మార్పులు జరగట్లేదు. కాబట్టి అదనపు ఆటగాళ్లకు అవకాశమేమీ లభించట్లేదు."

-థామస్ లండ్, ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సెక్రటరీ జనరల్.

కరోనా సంక్షోభం కారణంగా ఒలింపిక్స్​కు ముందు జరగాల్సిన మూడు పెద్ద టోర్నీలైనా ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్​లు రద్దయ్యాయి. పైగా ఆటగాళ్ల ర్యాంకుల్లోనూ ఎటువంటి మార్పులు జరగలేదు. దీంతో సైనా, శ్రీకాంత్​లు ఒలింపిక్స్​కు అర్హత సాధించలేకపోయారు.

భారత్​ నుంచి పీవీ సింధు, సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టీ, సాత్విక్ రాజ్​ రాంకీ రెడ్డి.. ఒలింపిక్స్​కు అర్హత సాధించారు.

ఇదీ చదవండి: 'సెరెనాతో బ్రేక్​ఫాస్ట్ చేయడమంటే ఇష్టం'

Last Updated : May 28, 2021, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.