ETV Bharat / sports

థాయ్​లాండ్​ ఓపెన్​: సింగిల్స్​ విజేతలు మారిన్, విక్టర్

కరోనా లాక్​డౌన్ తర్వాత జరిగిన తొలి బ్యాడ్మింటన్ టోర్నీ​ థాయ్​లాండ్​ ఓపెన్ ముగిసింది. సింగిల్స్ విజేతలుగా మారిన్, విక్టర్ నిలిచారు. ఒలింపిక్స్​ ముందున్న నేపథ్యంలో ఈ పతకాలు, వాళ్లకు ఆత్మవిశ్వాసం పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Thailand Open: Carolina Marin, Viktor Axelsen Clinch Singles Titles
థాయ్​లాండ్​ ఓపెన్​: సింగిల్స్​ విజేతలు కరోలినా, అక్సెల్సెన్
author img

By

Published : Jan 17, 2021, 9:43 PM IST

థాయ్​లాండ్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​ విజేతగా నిలిచిన కరోలినా మారిన్(స్పెయిన్).. టైటిల్​ను సొంతం చేసుకుంది.​ ఫైనల్​లో 21-9, 21-16తో తైవాన్​కు చెందిన టాప్ సీడ్ షట్లర్ తై జు ఇంగ్​ను ఓడించింది. తొలి నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు మారిన్.

ఫైనల్​కు అలా..

తొలి రౌండ్​లో షీషుఫేయిపై, రెండో రౌండ్​లో చోచువాంగ్​పై, క్వార్టర్​ ఫైనల్స్​లో కేట్​తాంగ్​పై, సెమీ ఫైనల్స్​ ఆన్​సే యంగ్​పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది మారిన్.

పురుషుల సింగిల్స్​ విజేతగా నిలిచిన డెన్మార్క్​ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సెన్​.. 21-14, 21-14 తేడాతో హాంగ్​కాంగ్​ షట్లర్ ఆంగస్ లాంగ్​పై గెలిచాడు.

Thailand Open: Carolina Marin, Viktor Axelsen Clinch Singles Titles
అక్సెల్సెన్

ఫైనల్​ చేరాడిలా..

తొలి రౌండ్​లో తమ్మాసిన్, రెండో రౌండ్​లో వాంగ్​ చారోఎన్, క్వార్టర్​ ఫైనల్స్​లో జోనాథన్ క్రిస్ట్రీ, సెమీ ఫైనల్స్​లో గింటింగ్​పై విజయం సాధించాడు విక్టర్.​

కరోనా లాక్​డౌన్​ తర్వాత తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఇదే. ఈ ఏడాది జులైలో టోక్యో ఒలింపిక్స్​ జరగనున్నాయి.

ఇదీ చూడండి: థాయ్​ ఓపెన్​లో ముగిసిన భారత్ పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.