ETV Bharat / sports

'కరోనాతో నా కెరీర్​లో భిన్నమైన అనుభవం ఎదురైంది' - star shuttelr pv sindhu

కొవిడ్​-19 కారణంగా తన కెరీర్​లో పూర్తి భిన్నమైన అనుభవం ఎదురైందని తెలిపింది సింధు. తన అనుభవాలు... భవిష్యత్ ఆలోచనలు ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Star Shuttelr p.v.Sindhu special interview with Eenadu
భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.సింధు
author img

By

Published : Mar 18, 2020, 7:15 AM IST

కరోనా వైరస్‌ కారణంగా భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.సింధు తెలిపింది. మ్యాచ్‌ తర్వాత క్రీడాకారులతో కరచాలనం చేసే సంప్రదాయాన్ని కూడా తాత్కాలికంగా పక్కనబెట్టేశానని చెప్పింది. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లో ఓడిన సింధు ఆదివారం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. కరోనా వైరస్‌తో తన కెరీర్‌లో పూర్తి భిన్నమైన అనుభవం ఎదురైందని 'ఈనాడు'తో సింధు తెలిపింది. సింధు అనుభవాలు.. భవిష్యత్తు ఆలోచనలు ఆమె మాటల్లోనే..

ఆల్‌ ఇంగ్లాండ్‌లో బాగానే ఆడా. బీవెన్‌ జాంగ్‌ (అమెరికా), సంగ్‌ హ్యున్‌ (కొరియా)పై విజయాలు సాధించా. క్వార్టర్స్‌లో ఒకుహర (జపాన్‌) చేతిలో ఓటమి ఎదురైంది. అనవసర తప్పిదాలు కొంపముంచాయి. రెండో గేమ్‌లో ప్రత్యర్థిని కాస్త నియంత్రించి ఉంటే విజయం వరించేదే. మూడో గేమ్‌లో ఆరంభంలోనే ప్రత్యర్థికి ఆధిక్యం ఇచ్చేశా. మొత్తంగా ఆట పరంగా బాగానే ఉన్నా.. అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకున్నా.

భిన్నమైన అనుభవం

టోర్నీలకు వెళ్లినప్పుడు తెలిసిన క్రీడాకారులు కలిస్తే కరచాలనం ఇవ్వడం సహజం. ఆల్‌ ఇంగ్లాండ్‌లో మాత్రం భిన్నమైన అనుభవం ఎదురైంది. ఎంత తెలిసినవాళ్లు ఎదురైనా చిరునవ్వే పలకరింపుగా మారింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత క్రీడాకారులు షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకునే సంప్రదాయాన్ని పక్కబెట్టేశారు. స్టేడియంలో భిన్న దేశాల వాళ్లు ఉండేవాళ్లు. ఎవరికి వారు దూరంగా కూర్చునేవాళ్లం. తప్పనిసరిగా మాస్క్‌ ధరించేవాళ్లం.

క్రీడల మంత్రికి ఫోన్‌

మార్చి 14 నుంచి ప్రభుత్వం వీసాల నియంత్రణ.. విమానాశ్రయాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిసింది. నిషేధిత దేశాల జాబితాలో ఇంగ్లాండ్‌ కూడా ఉంది. విదేశీ కోచ్‌ పార్క్‌ (కొరియా)ను పంపించేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చింది. క్వార్టర్‌ఫైనల్‌కు ముందురోజే పార్క్‌ వెళ్లిపోయాడు. కాస్త ఆందోళనగా అనిపించింది. నేను కూడా ఉండాలా.. వచ్చేయాలా అని క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజుకు ఫోన్‌ చేశా. జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే మ్యాచ్‌లు ఆడమని చెప్పారు. శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని సూచించారు.

Star Shuttelr p.v.Sindhu special interview with Eenadu
భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.సింధు

ఇంట్లోనే ఉంటున్నా

ఇంగ్లాండ్‌, దుబాయ్‌లతో పోల్చుకుంటే తెలంగాణలోనే పరిస్థితి అదుపులో ఉన్నట్లు కనిపిస్తుంది. కరోనా వైరస్‌ తీవ్రత ఇక్కడ తక్కువగా ఉంది. విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి వచ్చేశా. ఇంట్లోనే ఉంటున్నా. 10 రోజుల పాటు బయటికి వెళ్లట్లేదు. శిక్షణ కూడా బంద్‌. కరోనా వైరస్‌ ప్రభావం మనదగ్గర తక్కువగా ఉన్నా.. జాగ్రత్తగా ఉండటం అవసరం. మనకు తెలియకుండానే దేన్నైనా తాకుతుంటాం. ముఖం మీదకి చేయి వెళ్లిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో సానిటైజర్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఆరోగ్యం, భద్రత అన్నిటికంటే ప్రధానం. ప్రస్తుతానికి శిక్షణ లేదు కాబట్టి ఇంట్లోనే కసరత్తులు చేస్తున్నా.

కష్టంగా ఉన్నా.. తప్పదు

15 ఏళ్లకు పైగా ప్రతిరోజూ బ్యాడ్మింటన్‌ కోర్టుకు వెళ్లడం.. సాధన చేయడం అలవాటు. పది రోజులు ఆటకు దూరంగా ఉండాల్సి రావడం ఇదే ప్రథమం. కొంచెం కష్టంగానే ఉన్నా తప్పదు. ఆరోగ్యం ముఖ్యం. ఇంటి దగ్గరే ఏదో ఒక కసరత్తు చేస్తూ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటున్నా. ప్రస్తుతం టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఒలింపిక్స్‌ వాయిదా పడొచ్చేమో. కొంతమంది క్రీడాకారులు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాల్సి ఉంది. వారి విషయంలో బీడబ్ల్యూఎఫ్‌ ఉదారంగా వ్యవహరిస్తుందని అనుకుంటున్నా. ఒలింపిక్స్‌ ఎప్పుడు నిర్వహించినా బరిలో దిగడానికి నేను సిద్ధం.

ఇదీ చూడండి : 'భారత్​-పాక్​ మ్యాచ్​ లేని టెస్టు ఛాంపియన్​షిప్​ వృథా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.