మలేసియా ఓపెన్‌లో భారత షట్లర్ల పరాజయం పరిపూర్ణమైంది. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి సైనా.. సింధులు నిష్క్రమించారు. తాజాగా పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్.. చైనా బ్యాడ్మింటన్ దిగ్గజం చెన్‌లాంగ్‌తో పోరాడి ఓడాడు. క్వార్టర్‌పైనల్లో 18-21, 19-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం చెందాడు. ఇలా వరుసగా భారత షట్లర్లు నిరాశ పరిచారు.
తొలి గేమ్‌లో 16-11తో ముందున్న శ్రీకాంత్.. చెన్ దూకుడు ముందు తలొగ్గాడు. రెండో గేమ్‌లో మొదట తడబడినా తర్వాత పుంజుకుని 19-19తో స్కోరు సమం చేశాడు. అయితే చెన్ వరుస పాయింట్లు సాధించి విజయాన్నందుకున్నాడు. చిన్న చిన్న తప్పులు చేసిన శ్రీకాంత్ ఆట గెలిచేందుకు ప్రత్యర్థికి అవకాశం కల్పించాడు.
వీరిద్దరూ ముఖాముఖి ఆరు సార్లు తలపడగా 5సార్లు చెన్ గెలిచాడు. ఒక్కసారి మాత్రమే శ్రీకాంత్ నెగ్గాడు. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో చెన్‌లాంగ్‌పై చివరగా గెలిచాడు శ్రీకాంత్.