ఇండోనేసియా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ - 1000 టోర్నీలో భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ సత్తాచాటారు. తొలి రౌండ్లో జపాన్‌కు చెందిన ఒహోరిపై నెగ్గింది సింధు. అదే దేశానికి చెందిన నిషిమోటోపై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు శ్రీకాంత్.
5వ సీడ్ సింధు.. ఈ సీజన్లో తొలి టైటిల్‌పై కన్నేసింది. తొలి రౌండ్లో 11-21, 21-15, 21-15 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్లో ఓడిన సింధు తర్వాత పుంజుకుంది. ఈ ఏడాది ఆరు టోర్నీలు ఆడిన సింధు ఒక్కదాంట్లోనూ ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది.
21-14, 21-13 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించాడు శ్రీకాంత్. కేవలం 38 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించాడు. ఈ ఏడాది ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన కిదాంబి శ్రీకాంత్.. ఇండోనేసియా ఓపెన్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు.
మియా బ్లిచ్‌ఫెల్డ్(డెన్మార్క్)-వాంగ్ వింగ్(హాంకాంగ్) మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన వారితో తర్వాతి రౌండ్లో తలపడనుంది సింధు. బ్రైస్(ఫ్రాన్స్) - లాంగ్ అంగస్(హాంకాంగ్) మ్యాచ్‌లో గెలిచిన వారితో తర్వాత మ్యాచ్ ఆడనున్నాడు శ్రీకాంత్.
ఇది చదవండి: ట్వీట్ రేస్‌లో విన్నర్ 'భారత్ - పాక్ మ్యాచ్'