ETV Bharat / sports

బ్రిటన్‌లో ఆంక్షలు.. మరి సింధు థాయ్‌ వెళ్లేనా?

ప్రయాణ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్‌ నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్తానని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై అక్కడ నిషేధమేమీ లేదని పేర్కొంది.

author img

By

Published : Dec 22, 2020, 7:06 PM IST

Sindhu-hopeful-of-travelling-to-Thailand-from-UK-despite-increasing-travel-bans
బ్రిటన్‌లో ఆంక్షలు: సింధు థాయ్‌ వెళ్లేనా?

జనవరి 3న ఆరంభమయ్యే థాయ్‌‌ ఓపెన్లో ఆడతానని తెలిపింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. కొత్తరకం కరోనా వైరస్‌ వెలుగుచూడటం వల్ల బ్రిటన్​లో లాక్‌డౌన్‌ సహా ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. అయితే ఎలాగైనా తాను థాయ్ చేరుకుంటానంటోంది ప్రపంచ ఛాంపియన్.

"జనవరి మొదటి వారంలో నేను ప్రయాణం చేస్తాను. బ్రిటన్‌ నుంచి థాయ్‌లాండ్‌కు ప్రయాణ ఆంక్షలు లేవు. దోహా నుంచి నేను వెళ్లగలను. థాయ్‌ చేరుకొనేందుకు గల్ఫ్‌ దారిని ఎంచుకుంటాను. ప్రస్తుతం నా సాధన బాగా సాగుతోంది. ఇంగ్లాండ్‌లోని జాతీయ శిక్షణా కేంద్రం మూసివేయలేదు. బయోబబుల్‌ విధానంలో నడుస్తోంది. దాంతో థాయ్‌ ఓపెన్‌ ముందు సైతం సాధన చేసుకోగలను."

-- పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

కొంతకాలంగా సింధు ఇంగ్లాండ్‌లో శిక్షణ పొందుతోంది. కరోనా వైరస్‌ ముప్పు వల్ల మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్‌ టోర్నీలేవీ జరగలేదు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ ఉండటం వల్ల మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభిస్తుందనే ఉద్దేశంలో భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఎనిమిది మందితో కూడిన జట్టును ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌, 19 నుంచి 24 వరకు టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌, 27 నుంచి 31 వరకు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ జరుగనున్నాయి. వీటిల్లో భారత క్రీడాకారులు తలపడనున్నారు.

థాయ్ ఓపెన్‌తో బ్యాడ్మింటన్‌ మొదలవుతున్నప్పటికీ ప్రస్తుతం ఆ దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమం జరుగుతోంది. కొవిడ్‌-19 కేసులూ పెరుగుతున్నాయి. గతవారం అక్కడ 548 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: బ్యాడ్మింటన్​ టోర్నీ: 2021 తొలి అర్ధభాగం షెడ్యూల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.