ETV Bharat / offbeat

అన్నం, పులావ్‌, రోటీలకు మంచి కాంబినేషన్‌ - టేస్టీ "పాలక్ ఎగ్ కర్రీ" - ఈజీగా చేసుకోండిలా! - PALAK EGG CURRY RECIPE

పిల్లలు పాలకూరతో చేసిన వంటకాలు తినట్లేదా? - ఇలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తినడం పక్కా!

SPINACH EGG CURRY
Palak Egg Curry Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 12:29 PM IST

Palak Egg Curry Recipe in Telugu : ఇంట్లో ఎలాంటి కూరగాయలూ లేకపోతే గుడ్డుతో ఏదో ఒక కూర వండేయడం మామూలే. అలాగే ఎగ్స్​తో చేసే వంటకాలను ఇంట్లో వాళ్లూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగని ఎప్పుడూ ఒకే రుచిలో కర్రీలను ప్రిపేర్ చేసినా బోరింగ్ ఫీల్ వచ్చేస్తుంది. అందుకే మీకోసం ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "పాలక్ ఎగ్ కర్రీ". టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది! ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ! మరి, సూపర్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కోడిగుడ్లు - 3
  • పాలకూర - 150 గ్రాములు
  • నూనె - తగినంత
  • ఉల్లిపాయ - 1
  • టమాటాలు - 2
  • పచ్చిమిర్చి - 4
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • అల్లం ముక్క - 2 అంగుళాలు
  • దాల్చిన చెక్క - అంగుళం ముక్క
  • ధనియాల పొడి - అర టేబుల్​స్పూన్
  • కారం - తగినంత
  • జీలకర్ర - 1 టేబుల్​స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - చిటికెడు
  • గరంమసాలా - అర టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

ఎప్పుడూ ఆనియన్​ సమోసా ఏం బాగుంటుంది - ఓసారి "ఎగ్​ సమోసా" ట్రై చేయండి - టేస్ట్​ అద్దిరిపోతుంది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసుకోవాలి. ఆపై వాటిని సగం సగం ముక్కలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, టమాటాలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అల్లాన్ని పొట్టు తీసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని కట్ చేసుకున్న పాలకూరను వేసుకొని అది మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఆపై పాలకూరను ఉడికించి కాస్త చల్లార్చుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్​ తీసుకొని అందులో ఉడికించి చల్లార్చుకున్న పాలకూర, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ధనియాల పొడి వేసుకొని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • ఆపై అందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా వేయించుకున్నాక తరిగిన పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకొని అవి సాఫ్ట్​గా మారేంత వరకు మగ్గించుకోవాలి.
  • మిశ్రమాన్ని ఆవిధంగా ఉడికించుకున్నాక అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, గరంమసాలా యాడ్ చేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా ఒకసాలి చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత మూతపెట్టి మీడియం ఫ్లేమ్​ మీద మధ్యమధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి.
  • అనంతరం లో ఫ్లేమ్ మీద మరో మూడు నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికంగా ఉండే "పాలక్ ఎగ్ కర్రీ"రెడీ!
  • మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ కోసం చూస్తున్నారా ? - ఇంట్లోనే "ఓట్స్ ఆమ్లెట్"​ చేసేసుకోండి - టేస్ట్​ సూపర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.