Constitution on copper Foil In Warangal : వరంగల్‌కు చెందిన వైద్యారోగ్య శాఖ విశ్రాంత ఉద్యోగి వడ్డేపల్లి గోపాల్ రాజ్యాంగంపై తన అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు ఏడు నెలలపాటు శ్రమించి 260 రాగి రేకులపై రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. పలుచటి రాగి పత్రాలపై ఇంకు అయిపోయిన బాల్‌పెన్‌తో 2023 నవంబరులో మొదలుపెట్టి ఈ ఏడాది మే వరకు ఒక్కో అక్షరాన్ని చెక్కారు. దీని బరువు 18 కిలోల వరకు ఉంటుందని, ఇందుకు రూ.50 వేల వరకు ఖర్చయిందని గోపాల్ తెలిపారు. భారత అమృతోత్సవాల సందర్భంగా ఈ ఆలోచన వచ్చిందన్నారు. గతంలో బైబిల్‌ను 1050 రాగి రేకులపై రాసిన అనుభవం ఇందుకు ఉపయోగపడిందని చెప్పారు.
రాగి రేకులపై రాజ్యాంగం - ఏడు నెలలపాటు శ్రమించి ఆవిష్కరించిన విశ్రాంత ఉద్యోగి - CONSTITUTION ON COPPER FOIL
రాగి రేకులపై భారత రాజ్యాంగం - ఏడు నెలలపాటు శ్రమించి 260 రాగి రేకులపై రాసిన విశ్రాంత ఉద్యోగి వడ్డేపల్లి గోపాల్
Published : Nov 26, 2024, 12:29 PM IST