ETV Bharat / sports

Satwik Chirag Pair: వరల్డ్​ టూర్‌ ఫైనల్స్‌కు సాత్విక్‌- చిరాగ్ జోడీ

Satwik Chirag Pair: భారత స్టార్ డబుల్స్ సాత్విక్- చిరాగ్ జోడీ ప్రపంచ టూర్ ఫైనల్స్​కు అర్హత సాధించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొంటున్న తొలి భారత పురుషుల డబుల్స్‌ జోడీ వీరే కావడం విశేషం.

satwik-chirag
సాత్విక్- చిరాగ్
author img

By

Published : Nov 30, 2021, 7:00 AM IST

Satwik Chirag Pair: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌కు భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి అర్హత సాధించింది. ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ సెమీఫైనల్లో ఓడింది. జపాన్‌ జోడీ అకిర కోగా- తైచి సైటో పోరాటం కూడా సెమీస్‌లోనే ముగిసింది. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ మార్కస్‌- కెవిన్‌ (ఇండోనేసియా)పై గెలుచివుంటే భారత జోడీకి ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో(BWF World Tour Finals) నేరుగా బెర్తు దక్కేది.

అయితే మరో సెమీస్‌లో అకిర- తైచి ఓడటంతో సాత్విక్‌- చిరాగ్‌ జంటకు ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ బెర్తు లభించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొంటున్న తొలి భారత పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌- చిరాగే. బుధవారం ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు.. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌.. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప బరిలో ఉన్నారు.

ఇదీ చదవండి:

IPL Retention 2022: రిటెన్షన్​కు వేళాయే.. ఏ జట్టు ఎవరిని తీసుకునేనో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.