ఆడిన తొలి మ్యాచ్‌లోనే బలమైన ప్రత్యర్థి.. ప్రపంచ రెండో ర్యాంకు ఆటగాడితో పోటీ అంటే మాటలా.. కానీ చివరి అవకాశం వరకు ప్రయత్నించాడు సమీర్ వర్మ. అద్భుత ప్రదర్శన చేసినా చివరికి నిరుత్సాహపరిచాడు.
- కౌలాలంపూర్‌లో జరిగిన మలేషియా ఓపెన్‌లో భారత ఆటగాడు సమీర్ వర్మ 20-22, 23-21, 12-21 తేడాతో షి యూకి (చైనా)పై పోరాడి ఓడిపోయాడు. 65 నిమిషాల పాటు జరిగిన ఈ సింగిల్స్ మ్యాచ్‌లో చివరకు ఓటమి చవిచూశాడు.
డబుల్స్‌లోనూ నిరాశే:
అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి ద్వయం తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ క్రీడాకారులపై సత్తా చాటినా.. రెండో మ్యాచ్‌లో కొరియా చేతిలో 20-22, 21-17, 20-22 తేడాతో ఓటమిపాలయ్యారు.