మలేసియా మాస్టర్స్ సూపర్-500లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దూసుకెళ్తోంది. కౌలాలంపుర్ వేదికగా జరిగిన ఈ టోర్నీ రెండో రౌండ్లో దక్షిణాకొరియా ప్లేయర్ యాన్ సే యంగ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది.
మహిళల సింగిల్స్ విభాగంలో యంగ్‌ను 25-23, 21-12 తేడాతో ఓడించింది సైనా. 39 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిందీ మ్యాచ్. తొలి సెట్ రసవత్తరంగా జరిగింది. రెండు సార్లు స్కోర్లు సమమైనప్పటికీ సైనా పట్టువిడవకుండా గేమ్ సొంతం చేసుకుంది. అనంతరం రెండో సెట్లో ప్రత్యర్థి అంత పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా 21-12తో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది సైనా.
దక్షిణాకొరియా ప్లేయర్‌పై సైనాకు ఇదే తొలి విజయం. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఈ షట్లర్ చేతిలో పరాజయం పాలైంది భారత ఒలింపిక్ పతక గ్రహీత.
క్వార్టర్స్‌లో సైనాకు పెద్ద అడ్డింకి ఎదురుకానుంది. రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేత కరొలిన్ మారిన్‌తో తలపడనుంది.
ఇదీ చదవండి: వైరల్: భారీ సిక్సర్‌కు కోహ్లీ, శ్రేయస్ 'ఎక్స్ప్రెషన్స్'