ETV Bharat / sports

PV Sindhu: స్వదేశానికి పీవీ సింధు- దిల్లీలో ఘనంగా సన్మానం - పీవీ సింధు లేటెస్ట్​ అప్డేట్స్​

టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధించిన బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు స్వదేశానికి చేరుకుంది. అధికారులు, అభిమానులు ఆమెకు దిల్లీలో ఘన స్వాగతం పలికారు. అనంతరం సింధు, ఆమె కోచ్​ పార్క్​ తే సంగ్​కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

PV SINDHU
పీవీ సింధు
author img

By

Published : Aug 3, 2021, 4:12 PM IST

Updated : Aug 3, 2021, 8:35 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగుపెట్టింది. మంగళవారం మధ్యాహ్నం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం సింధు, ఆమె కోచ్​ పార్క్​ తే సంగ్​కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వీరిద్దరిని సత్కరించారు. సింధును ప్రశంసించారు.

PV SINDHU
కేంద్ర క్రీడా శాఖ మంత్రితో సింధు
PV SINDHU
సింధును సన్మానిస్తున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి
PV SINDHU
కేంద్ర క్రీడా శాఖ మంత్రి సమక్షంలో
దిల్లీ విమానాశ్రయంలో పీవీసింధుకు ఘన స్వాగతం
PV Sindhu
కేంద్రమంత్రుల సన్మానం
pv sindhu
దిల్లీ విమానాశ్రయంలో పీవీ సింధు
pv sindhu
పీవీ సింధుకు ఘనస్వాగతం
సింధు

తన పతకాన్ని దేశ​ ప్రజలకు అంకితమిస్తున్నట్టు ప్రకటించింది సింధు. ఇన్నేళ్లు అండగా నిలిచిన తన తల్లిదండ్రులు, బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ సహా తనను ప్రోత్సహించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.

"నేను సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ సహా నన్ను ప్రోత్సహించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు."

-సింధు, భారత బ్యాడ్మింటన్​ స్టార్​.

"నువ్వు యూత్​ ఐకాన్​, యువతకు స్ఫూర్తి. దేశంలో ఉన్న గొప్ప ఒలింపియన్స్​లో నువ్వు ఒకరు. మేమంతా గర్వపడేలా చేశావు. 135 కోట్ల ప్రజల మొహాలపై నవ్వులను తీసుకొచ్చావు."

-అనురాగ్​ ఠాకూర్​, కేంద్ర క్రీడా శాఖ మంత్రి.

''సింధు మరోసారి సత్తా చాటింది. ఆమె కుటుంబం, కోచ్​ సహకారంతో పాటు నిరంతర శ్రమతోనే ఒలింపిక్స్​లో పతకం సాధించింది.''

-- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో సింధు కాంస్య పతకం సాధించింది. దీంతో వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి: రెండు పతకాలతో రికార్డు.. ఒకరు జైల్లో, మరొకరు గుండెల్లో!

Last Updated : Aug 3, 2021, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.