ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్‌లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన పీవీ సింధు తీవ్ర నిరాశపరిచింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన తెలుగుతేజం క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. శుక్రవారం జపాన్ క్రీడాకారిణి అకానే యమగూచితో జరిగిన పోరులో 18-21, 15-21 తేడాతో ఓటమిపాలైంది.
ఈ టోర్నీకి ముందు ఇండోనేసియా ఓపెన్‌లో పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. జపాన్‌కు చెందిన యమగూచి చేతిలోనే ఫైనల్లో ఓడిపోయింది.
ఇవీ చూడండి...జపాన్ ఓపెన్: సెమీస్‌లో అడుగుపెట్టిన సాయి ప్రణీత్