కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సోమవారం బ్యాడ్మింటన్ రాకెట్లను బహుమతిగా అందించారు. పద్మ భూషణ్ అవార్డును ఆదివారం అందుకున్న ఆమె అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రిని కలిసి ముచ్చటించారు. ఈ విషయాన్ని రిజిజు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
'పీవీ సింధు సాధించిన విజయాలకుగానూ పద్మ భూషణ్ అవార్డు దక్కడం క్రీడారంగానికి గొప్ప గౌరవం. అభినందనలు సింధు. అలాగే నాకు అత్యంత నాణ్యమైన బ్యాడ్మింటన్ రాకెట్లు బహుమతిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే రాకెట్ హ్యాండిల్ గ్రిప్‌ను ఎలా చుట్టాలో నేర్పినందుకు ధన్యవాదాలు' అంటూ వారి సంభాషణకు సంబంధించిన వీడియోను రిజిజు ట్విటర్‌లో పోస్టు చేశారు.
-
Keep winning for India, keep smiling, and make India proud @Pvsindhu1 https://t.co/iNoXIf7xeo pic.twitter.com/QzovKVTXR3
— Kiren Rijiju (@KirenRijiju) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Keep winning for India, keep smiling, and make India proud @Pvsindhu1 https://t.co/iNoXIf7xeo pic.twitter.com/QzovKVTXR3
— Kiren Rijiju (@KirenRijiju) November 8, 2021Keep winning for India, keep smiling, and make India proud @Pvsindhu1 https://t.co/iNoXIf7xeo pic.twitter.com/QzovKVTXR3
— Kiren Rijiju (@KirenRijiju) November 8, 2021
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం దిల్లీలో జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సింధు పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇవీ చదవండి: