ETV Bharat / sports

క్రీడా పురస్కారాల నామినేషన్లపై ప్రణయ్​ అసహనం - భారత బ్యాడ్మింటన్​ సంఘండ

ప్రతిష్టాత్మక అర్జున పురస్కారం విషయంలో, తనను మరోసారి విస్మరించారని యువ షట్లర్ ప్రణయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కంటే తక్కువ ప్రతిభ గల వారిని బాయ్ నామినేట్​ చేసిందని విచారం వ్యక్తం చేశాడు.

Prannoy fumes after being ignored for Arjuna award for second successive year
క్రీడా పురస్కారాల నామినేషన్లపై ప్రణయ్​ అసహనం
author img

By

Published : Jun 3, 2020, 5:27 PM IST

వరుసగా రెండో ఏడాది తనను అర్జున అవార్డుకు నామినేట్​ చేయకపోవడంపై భారత షట్లర్​ హెచ్​.ఎస్.ప్రణయ్​ అసహనం వ్యక్తం చేశాడు. ఆటలో తన కంటే తక్కువ పరిణతి గల వ్యక్తులను బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (బాయ్) ఎంపిక చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడీ ఆటగాడు.

"అర్జున అవార్డ్స్​లో గతేడాది జరిగిందే ఇప్పుడు జరిగింది. కామన్వెల్త్, ఆసియన్​ ఛాంపియన్​షిప్​లలో పతకాలు సాధించిన వారిని కాకుండా ఏ విధమైన పతాలను సాధించని ప్లేయర్లను నామినేట్​ చేశారు"

- హెచ్​.ఎస్​ ప్రణయ్​, భారత షట్లర్

ఈ పురస్కారానికి డబుల్స్​ జోడీ సాత్విక్​ సాయిరాజ్, చిరాగ్​ శెట్టితో పాటు సింగిల్స్​ ప్లేయర్​ సమీర్ వర్మను నామినేట్​ చేసింది బాయ్. వీరిలో సాత్విక్​-చిరాగ్​.. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్​లో రజతాన్ని దక్కించుకున్నారు.

దరఖాస్తులు చేసేందుకు గడువు పెంపు

జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తుల గడువును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జూన్​ 22 వరకు పెంచింది. లాక్​డౌన్​తో అథ్లెట్లు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ప్రక్రియలో కొన్ని సడలింపులనిచ్చి గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ సంక్షోభం సమయంలో క్రీడాకారులు తమను తాము స్వీయ సిఫారసు చేసుకోవచ్చని తాజా ప్రకటనలో తెలియజేసింది. దరఖాస్తులను ఆన్​లైన్​లో పంపొచ్చని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ పుట్టినరోజైన ఆగస్టు 29న ఈ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తారు.

ఇదీ చూడండి... మేరీకోమ్​తో వివాదంపై యువ బాక్సర్ నిఖత్ స్పందన​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.