para badminton national gold medalist: పారా ఒలింపిక్ విజేత కృష్ణా నగర్ తన అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న జాతీయ నాలుగో పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించారు.
సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఛాంపియన్‌గా నిలిచారు. 2019లో జాతీయస్థాయిలో మూడు స్వర్ణాలను గెలుచుకుని రికార్డు సాధించిన కృష్ణా నగర్.. తన రికార్డును తానే పునరావృతం చేశారు.
పురుషుల సింగిల్స్‌లో 21-12, 21-12 పాయింట్లతో ప్రత్యర్థి సుదర్శన్‌పై నెగ్గి పసిడి పతకాన్ని ఒడిసిపట్టారు కృష్ణ. ఈ మ్యాచ్‌ను కేవలం 20 నిమిషాల్లోనే ముగించడం విశేషం.
మిక్స్‌డ్ డబుల్స్‌లో కృష్ణా నగర్- నిత్య శ్రీ జోడీ.. దినగరన్-లతాతై ఉమ్రేకర్‌పై కేవలం 17 నిమిషాల్లో విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో కృష్ణా నగర్-రాజా మగోత్రా జోడీ 21-15, 21-15తో దినగరన్-శివరాజన్ జోడీని మట్టికరింపించింది.
"నా ఆటతీరు పట్ల నేను సంతోషంగా ఉన్నాను. వరుసగా నేషనల్స్‌లో మొత్తం 3 స్వర్ణాలు గెలుచుకోవడం గొప్ప అనుభూతి. ప్రస్తుతం నా దృష్టి.. రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్‌లపైనే ఉంది. ఈ విజయం తప్పకుండా నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరింత మెరుగ్గా సన్నద్ధం కావడానికి సహాయపడుతుంది," అని కృష్ణా నగర్ చెప్పారు.
ఇవీ చూడండి: