ETV Bharat / sports

పద్మ భూషణ్​ స్వీకరించిన పీవీ సింధు - Rani Rampal padma sri

దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుల పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకుంది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.

sindhu
సింధు
author img

By

Published : Nov 8, 2021, 12:10 PM IST

Updated : Nov 8, 2021, 3:05 PM IST

దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2020లో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారాలు అందజేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హెంమంత్రి అమిత్ షా సహా ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. పద్మ భూషణ్ పురస్కారాన్ని స్వీకరించింది.

పద్మ భూషణ్​ స్వీకరించిన పీవీ సింధు

"ఇది చాలా గర్వకారణం. ఈ పురస్కారం అందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇలాంటి పురస్కారాలు క్రీడాకారుల్లో ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతాయి. భవిష్యత్ టోర్నీల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది సింధు.

ఇవీ చూడండి: 'టీమ్ఇండియా ఓటమికి టాస్ కారణం కాదు'

Last Updated : Nov 8, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.