ETV Bharat / sports

కొనసాగుతున్న వైఫల్యం.. చైనా ఓపెన్​ నుంచి కశ్యప్ ఔట్..​ - Kashyap knocked out of China Open

భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్​ చైనా ఓపెన్​ నుంచి నిష్క్రమించాడు. డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

పారుపల్లి కశ్యప్
author img

By

Published : Nov 7, 2019, 12:14 PM IST

చైనా ఓపెన్​లో భారత షట్లర్ల వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సైనా నెహ్వాల్, పీవీ సింధు ఇంటిముఖం పట్టగా.. తాజాగా పారుపల్లి కశ్యప్ ఈ జాబితాలో చేరిపోయాడు. పురుషుల సింగిల్స్​ విభాగంలో డెన్మార్క్​కు చెందిన విక్టర్ అక్సెల్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

13-21, 19-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు కశ్యప్. 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్​ ముగిసింది. తొలి సెట్లో పెద్దగా ఆకట్టుకోని భారత షట్లర్.. రెండో గేమ్​లో పోరాడినప్పటికీ విజయం ప్రత్యర్థినే వరించింది.

ఈ ఏడాది విక్టర్ చేతిలో రెండోసారి పరాజయం పాలయ్యాడు కశ్యప్. మార్చిలో జరిగిన ఇండియా ఓపెన్​ సెమీస్​లోనూ ఓడాడు. ఈరోజు సాయంత్రం రెండో రౌండ్​లో డెన్మార్క్ ఆటగాడు ఆండెర్స్​తో తలపడనున్నాడు మరో ఆటగాడు సాయి ప్రణీత్.

ఇదీ చదవండి: ఆఖరి వన్డే టీమిండియాదే.. సిరీస్​ కైవసం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.