భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ పెళ్లి పీటలెక్కారు. గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ.. వివాహబంధంతో గురువారం(ఏప్రిల్ 22) ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితులు హజరయ్యారు. విష్ణు విశాల్-గుత్తా జ్వాల ఫొటోలు నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
![Jwala Gutta-Vishnu Vishal's wedding Photos goes viral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11498101_1-1.jpg)
ఉగాది నాడు తమ పెళ్లి పత్రికను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన విష్ణు విశాల్.. కరోనా నిబంధనల కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం కుదరలేదని స్పష్టం చేశారు. అయితే విష్ణు విశాల్, గుత్తా జ్వాలకు ఇది రెండో వివాహం. గతంలో రజనీ నటరాజన్ అనే ఆమెను పెళ్లి చేసుకున్న విష్ణు.. ఆ తర్వాత విడాకులు ఇచ్చారు. మరోవైపు గుత్తా జ్వాల.. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను వివాహమాడి.. ఆ తర్వాత విడిపోయారు. ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి.. ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లికి దారితీసింది.
![Jwala Gutta-Vishnu Vishal's wedding Photos goes viral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11498101_2-1.jpg)
![Jwala Gutta-Vishnu Vishal's wedding Photos goes viral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11498101_4.jpg)
![Jwala Gutta-Vishnu Vishal's wedding Photos goes viral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11498101_2.jpg)
ఇదీ చూడండి.. ఓటీటీ కోసం 'చావు కబురు చల్లగా' సరికొత్తగా!