ETV Bharat / sports

'టోక్యో ఒలింపిక్స్​పై ఐఓసీ నిర్ణయం ఫన్నీగా ఉంది' - Parupalli Kashyap after IOC asks athletes to continue training for the Tokyo Games

అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ.. టోక్యో ఒలింపిక్స్ సన్నాహకాలు కొనసాగించడం సరైనది కాదని భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ అన్నాడు. ఇది ఒక జోక్​లా అనిపిస్తోందని తెలిపాడు.

arupalli Kashyap after IOC asks athletes to continue training for the Tokyo Games
ఐఓసీ జోకులు వేస్తోంది
author img

By

Published : Mar 20, 2020, 9:02 AM IST

టోక్యో ఒలింపిక్స్‌కు సన్నాహకాలను కొనసాగించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ చెప్పడం జోక్‌గా అనిపిస్తోందని భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ అన్నాడు.

"క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం అందరూ ఒలింపిక్స్‌ సన్నాహకాలు కొనసాగించాలని ఐఓసీ అంటోంది. కానీ ఎలా? ఎక్కడ? ఇదో జోక్‌లా ఉంది.. ఎవరు టోక్యోకు వెళుతున్నారో ఇంకా తెలియదు. అర్హత సాధించే అవకాశం ఉన్నవాళ్లకు శిక్షణ పొందడానికి శిబిరం లేదు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులను ఐఓసీ శిక్షణ కొనసాగించడమనడంలో అర్థమే లేదు"

-కశ్యప్‌, భారత షట్లర్‌.

భారత షట్లర్లు శిక్షణ పొందుతున్న సాయ్‌-గోపీచంద్‌ అకాడమీ మార్చి 31 వరకు మూసేశారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే ఏప్రిల్‌ 28 నాటికి టాప్‌-16 ర్యాంకింగ్స్‌లో ఉండాలి. ప్రస్తుతం కశ్యప్‌ 25వ ర్యాంకులో ఉన్నాడు.

ఇదీ చూడండి : పుత్రోత్సాహంలో మోర్గాన్...కొడుకు పేరేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.