ETV Bharat / sports

ఉబెర్​కప్​లో భారత మహిళలు ఔట్‌

ఉబెర్​కప్​ క్వార్టర్​ ఫైనల్స్​లో(Uber Cup 2021) భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. 3-0 ఆధిక్యం సంపాదించిన జపాన్​ మరో రెండు మ్యాచ్​లు ఉండగానే సెమీస్​కు చేరుకుంది. మరోవైపు థామస్​కప్​లో(Thomas Cup 2021) భారత పురుషుల జట్టు గ్రూప్ దశ చివరి లీగ్​ మ్యాచ్​లో ఓటమిపాలైంది.

Uber Cup India
ఉబెర్​కప్ ఇండియా
author img

By

Published : Oct 15, 2021, 8:06 AM IST

ఉబెర్‌కప్‌లో భారత మహిళల జట్టు(Uber Cup News) కథ ముగిసింది. క్వార్టర్‌ఫైనల్లో(Uber Cup quarter final) ఆ జట్టు జపాన్‌ చేతిలో పరాజయం పాలైంది. సింధు, సైనా లేని భారత జట్టు తేలిపోయింది. పోరులో(Uber Cup India vs Japan) 3-0 ఆధిక్యం సంపాదించిన జపాన్‌ మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సెమీఫైనల్లో ప్రవేశించింది. మొదట మాళవిక 12-21, 17-21తో ప్రపంచ నంబర్‌-5 యమగూచి చేతిలో ఓడిపోవడంతో జపాన్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తనీషా, రుతపర్ణ జంట 8-21, 10-21తో యుకి ఫుకుషిమ, మాయు మత్సుముటో జోడీ చేతి కంగుతింది. మూడో మ్యాచ్‌లో సయాక తకహషి 21-16, 21-7తో అదితి భట్‌ను ఓడించి.. అయిదు మ్యాచ్‌ల పోరులో జపాన్‌కు 3-0 ఆధిక్యాన్ని అందించింది.

థామస్‌కప్‌లో..: థామస్‌ కప్‌లో(Thomas Cup) ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌ చేరుకున్న భారత పురుషుల జట్టుకు గ్రూపు దశలో చివరి లీగ్‌ మ్యాచ్‌లో చుక్కెదురైంది. గురువారం జరిగిన గ్రూపు-సి పోరులో భారత్‌ 1-4తో చైనా చేతిలో ఓడింది. గ్రూపు దశలో నెదర్లాండ్స్‌, తాహిటిలపై విజయాలు నమోదు చేసిన భారత్‌.. 2010 తర్వాత తొలిసారిగా థామస్‌ కప్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌ పోరులో డెన్మార్క్‌తో తలపడుతుంది.

ఇదీ చదవండి:

'కోహ్లీపై ఒత్తిడి తగ్గాలంటే.. కేఎల్​ రాహుల్​ రాణించాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.