ETV Bharat / sports

ఆసియా ఛాంపియన్​షిప్​లో సెమీస్​ చేరిన భారత్​ - ఆసియా బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​ న్యూస్​

ఆసియా బ్యాడ్మింటన్​ టీమ్​ ఛాంపియన్​షిప్​లో భారత పురుషుల జట్టు సత్తా చాటింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్​లో థాయ్​లాండ్​పై విజయం సాధించింది. శనివారం సెమీఫైనల్లో ఇండోనేషియాతో తలపడనుంది.

Indian-Men-Assure-Themselves-of-Medal-by-Reaching-Semis
ఆసియా ఛాంపియన్​షిప్​లో సెమీస్​కు చేరిన భారత్​
author img

By

Published : Feb 15, 2020, 1:12 PM IST

Updated : Mar 1, 2020, 10:07 AM IST

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్​షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్​కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్​లో.. థాయ్‌లాండ్‌ను 2-3 తేడాతో ఓడించింది భారత్​ బృందం. తొలి సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌ (14-21, 21-14, 12-21), రెండో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ (20-22, 14-21) వరుసగా పరాజయం పాలయ్యారు. ఫలితంగా భారత్‌ 0-2తో వెనుకబడింది. తర్వాత పుంజుకొని వరుసగా మూడు మ్యాచ్​ల్లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది.

Indian-Men-Assure-Themselves-of-Medal-by-Reaching-Semis
ఆసియా బ్యాడ్మింటన్​ పురుషుల ఛాంపియన్​షిప్​లో భారత బృందం

మూడో మ్యాచ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల్​-ఎంఆర్‌ అర్జున్‌ జోడీ (21-18, 22-20), నాలుగో మ్యాచ్‌ సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ (21-19, 21-18) చెలరేగి ఆడారు. ఫలితంగా స్కోరు 2-2తో సమమైంది. నిర్ణయాత్మక అయిదో మ్యాచ్‌లో చిరాగ్‌ శెట్టి - కిదాంబి శ్రీకాంత్‌ జోడీ 21-15, 16-21, 21-15 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి భారత్‌కు విజయాన్ని అందించారు.

నేటి సెమీస్‌ మ్యాచ్​లో ఇండోనేషియాతో తలపడనుంది భారత్​. 2016 ఆసియా ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లో ఇరుజట్లు పోటీపడగా... ఇండో జట్టే పైచేయి సాధించింది. మరి ఈ సారైనా ఫలితం మారుతుందేమో చూడాలి.

ఇదీ చూడండి.. దెబ్బకు దెబ్బ.. దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్​ విజయం

Last Updated : Mar 1, 2020, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.