ETV Bharat / sports

ఒలింపిక్స్.. ఈసారి అంత సులభం కాదు: సింధు - టోక్యో ఒలింపిక్స్ సింధు

ఈసారి ఒలింపిక్స్ అంత సులభమేమి కాదని స్టార్ షట్లర్ పీవీ సింధు అభిప్రాయపడింది. ప్రతి మ్యాచ్​, ప్రతి పాయింట్ ఎంతో కీలకమని చెప్పింది. లీగ్​ దశలో మంచి డ్రా లభించిందని తెలిపింది.

Sindhu
సింధు
author img

By

Published : Jul 9, 2021, 7:50 PM IST

టోక్యో ఒలింపిక్స్​ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్​ లీగ్ దశలో సులువైన డ్రా లభించటంపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హర్షం వ్యక్తం చేసింది. అయితే ఒలింపిక్స్​లో ప్రతి మ్యాచ్, ప్రతి పాయింట్ ఎంతో ముఖ్యమని​ స్పష్టం చేసింది. ఈసారి అంత సులువు ఏం కాదని అభిప్రాయపడింది.

మహిళల సింగిల్స్​లో ఆరో సీడ్​గా బరిలో ఉన్న సింధు.. ప్రపంచ నంబర్​.34 చిగ్​ గన్​ యై, సెనియా పొలికర్పొవా(ఇజ్రాయెల్​)తో లీగ్​ దశలో తలపడనుంది.

"లీగ్​ స్టేజ్​లో మంచి డ్రా లభించింది. హాంకాంగ్​ క్రీడాకారిణితో మ్యాచ్​గా అద్భుతంగా ఉండనుంది. ప్రతి ఒక్కరు టాప్​ ఫామ్​లో దూసుకెళ్తున్నారు. నేను కూడా బాగా ఆడతానని అనుకుంటున్నా. ప్రతి మ్యాచ్ ఎంతో ముఖ్యం. ఇది ఒలింపిక్స్​. ఈసారి అంత సులువు ఏం కాదు"

-- పీవీ సింధు, భారత స్టార్​ షట్లర్​

గ్రూప్ దశలో ప్రత్యర్థులు చిగ్​ గన్​ యై, సెనియా పొలికర్పొవాలతో గతంలో అన్ని మ్యాచ్​ల్లోనూ విజయం సాధించిన రికార్డు సింధుకు ఉంది.

షేర్​ చాట్​లోకి సింధు..

సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులకు అందుబాటులో ఉండే పీవీ సింధు.. తాజాగా షేర్​ చాట్​లోనూ ఖాతా తెరిచింది.

ఇదీ చదవండి :

Olympics: సింధు, ప్రణీత్​కు సులువైన డ్రా

Olympics: స్వర్ణం సాధించాలని.. కోటి ఆశలు సింధుపైనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.