ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​ నుంచి వైదొలిగిన మారిన్ - బ్యాడ్మింటన్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకుంది. గాయం కారణంగా ఈ వారం చివర్లో సర్జరీ చేయించుకోనున్నట్లు వెల్లడించింది.

Carolina Marin,  ruled out of Tokyo Olympics
కరోలినా మారిన్, స్పెయిన్ బ్యాడ్మింటన్ ప్లేయర్
author img

By

Published : Jun 1, 2021, 5:42 PM IST

స్పెయిన్​ బ్యాడ్మింటన్​ స్టార్, రియో ఒలింపిక్స్​ ఛాంపియన్​ కరోలినా మారిన్.. టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలిగింది. ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న తను ఈ వారం చివర్లో శస్త్ర చికిత్స చేయించుకోనుంది. ఈ విషయాన్ని స్వయంగా మారిన్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది.

ప్రాక్టీస్​ సందర్భంగా గాయపడ్డ మారిన్.. తర్వాత కొంత అసౌకర్యానికి గురైనట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వైద్య పరీక్షల అనంతరం తన మోకాలి లిగ్మెంట్​లో చీలిక వచ్చినట్లు పేర్కొంది. ఈ వారం చివర్లో సర్జరీ అనంతరం త్వరగానే తిరిగి కోర్టులో అడుగుపెట్టనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది ఈ స్పెయిన్​ స్టార్. ఇప్పటివరకు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పంది మారిన్.

ఇదీ చదవండి: సైనా, శ్రీకాంత్​.. ఒలింపిక్స్​ ఆశలు ఆవిరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.