ETV Bharat / sitara

'తాండవ్' బృందంపై ఎఫ్​ఐఆర్.. పోస్టర్లకు నిప్పు

హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న 'తాండవ్' సిరీస్​ను నిషేధించాలని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. అలానే పోస్టర్లు కాల్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Tandav controversy: FIR against director, Amazon India head of content
'తాండవ్' బృందంపై ఎఫ్​ఐఆర్.. పోస్టర్లకు నిప్పు
author img

By

Published : Jan 18, 2021, 3:34 PM IST

'తాండవ్' వెబ్ సిరీస్​లో హిందు దేవుళ్లను కించపరిచేలా కొన్ని సీన్లు, డైలాగ్​లు ఉన్నాయని హజ్రత్​గంజ్ కొత్వాలీ పోలీస్​ స్టేషన్​లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సిరీస్​ దర్శక నిర్మాతలతో పాటు అమెజాన్ ఇండియా హెడ్​ అపర్ణ పురోహిత్​పై కేసు పెట్టాడు. ఈ విషయాన్ని సీనియర్ సబ్​ ఇన్​స్పెక్టర్ అమర్​నాథ్ యాదవ్ వెల్లడించారు.

జనవరి 15న విడుదలైన సిరీస్​లోని​ తొలి ఎపిసోడ్​ 17వ నిమిషంలో హిందు దేవతలను కించపరిచేలా చూపించారంటూ, డైలాగ్​ల్లోని భాష సరిగా లేవని సదరు వ్యక్తి ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. ఇవి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పాడు.

కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్​కు, 'తాండవ్' సిరీస్​పై నిషేధం గురించి తాను లేఖ కూడా రాశానని భాజపా ఎంపీ మనోజ్ కోటక్ ఆదివారం చెప్పారు. ఈ విషయమై స్పందించిన సదరు శాఖ.. వివాదంపై అమెజాన్ వీడియో ఇండియాను వివరణ కోరినట్లు తెలుస్తోంది.

ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. వాటిలో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్​సిరీస్​లను పర్యవేక్షించుకోవాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

'తాండవ్'ను నిషేధించాలని మధ్యప్రదేశ్​ భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు. సిరీస్​కు సంబంధించిన పోస్టర్లను సోమవారం తగలబెట్టారు.

Tandav controversy
'తాండవ్' పోస్టర్లను తగలబెట్టిన భాజపా కార్యకర్తలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.