Squid game new season: 'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్.. ఓటీటీ తరచుగా ఉపయోగించేవారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌ల్లో ఇది ది బెస్ట్‌గా నిలిచింది. అలానే నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువమంది చూసిన సిరీస్‌గానూ రికార్డు సృష్టించింది.
ఇప్పుడు ఈ సిరీస్‌కు కొనసాగింపుగా పార్ట్ 2,3 కచ్చితంగా తీస్తానని డైరెక్టర్ వాంగ్ డాంగ్ హైక్ చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం చర్చల దశలో ఉందని తెలిపారు. తొలి సీజన్లో విజేతగా నిలిచిన జీ హున్ కథతో రెండో సీజన్లో ఉంటుందని దర్శకుడు స్పష్టం చేశారు.
ఏంటి 'స్క్విడ్ గేమ్'?
జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పుల పాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్ గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఇలాంటివి మొత్తం ఆరు పోటీలుంటాయి. చివరగా వచ్చే ఆట పేరే 'స్క్విడ్ గేమ్'.
దక్షిణ కొరియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న చిన్నపిల్లల ఆట ఇది. ఈ ఆరు ఆటల్లో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 45.6 బిలియన్ కొరియన్ వన్ (39 మిలియన్ డాలర్లు) గెలుచుకోవచ్చు. అన్ని సులభమైనవి, సరళమైన ఆటలే. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ఈ ఆటలో ఓడిపోయినవారు పోటీ నుంచి శాశ్వతంగా ఎలిమినేట్ అవుతారు. ఆటలోంచే కాదు, జీవితం నుంచే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఓడిపోతే చంపేస్తారని అర్థం. మొదటి ఆట ఆడితే కానీ ఈ విషయం వారికి తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆరు ఆటలను దిగ్విజయంగా పూర్తిచేసుకొని చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ.
సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్‌సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌లో తక్కవ సమయంలో ఎక్కువమంది చూసిన సిరీస్‌గా నిలిచింది. కేవలం 27 రోజుల్లో 111 మిలియన్ వీక్షకులకు చేరువైందని సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: