కమెడియన్, నటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'. తాజాగా ఈ కార్యక్రమానికి నటి షకీలా, అనురాధ విచ్చేసి తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జీవితంలో వారు ఎదుర్కొన్న కష్టసుఖాలను తన స్వీయ జీవిత చరిత్రలో వెల్లడించానని షకీలా తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ క్రమంలో తన వివాహం గురించి షకీలా మాట్లాడుతూ.. "ఒక సారి నాకు పెళ్లి కుదిరింది. వివాహ తేదీని కూడా ఫిక్స్ చేశారు. అమ్మ చనిపోయిన తర్వాత అన్ని ఆ వ్యక్తే అనుకున్నాను. అయితే రోకా సమయంలో ఆ వ్యక్తి (పెళ్లికొడుకు) మద్యం తాగి వచ్చి గొడవ చేశాడు. 'నిన్నెవడు చేసుకుంటాడు, నీకు ఈ సిగరెట్ అలవాటు ఉండకూడదు, సిగరెట్ వదిలితేనే నిన్ను చేసుకుంటాను' అంటూ వాగాడు. అప్పుడు 'ఎక్కువగా మాట్లాడబాక' అంటూ హ్యాంగర్ తీసి కొట్టటం అంటే అది కాదు కొట్టడం.. అలా కొట్టా. యూ డోంట్ బిలీవ్ ఇట్. అతడికి తోలంతా ఊడొచ్చింది. అలాగే లాక్కెళ్లి బండెక్కించి అడ్రెస్ ఇచ్చి ఈయన్ని అక్కడ దింపమని చెప్పేసి పైకొచ్చి వాళ్లమ్మకి ఫోన్ చేశా. 'నాకు పెళ్లి వద్దు, ఏం వద్దు. మీరు రావొద్దు మా ఇంటికి'. అయిపోయింది. కాకపోతే ఆ కుటుంబంలోని వారందరూ ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉంటారు" అని షకీలా నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.