ETV Bharat / sitara

కుటుంబంతో కలిసి 'రామాయణం' చూసిన 'రాముడు' - దూరదర్శన్​ రామాయణం

1987.. దూరదర్శన్​ ఛానెల్​లో ప్రసారమైన 'రామాయణం' అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ధారావాహికను పునఃప్రసారం చేయాలని డీడీ ఛానెల్ గతవారం నిర్ణయించింది. అయితే అందులో రాముని పాత్రలో నటించిన అరుణ్​ గోవిల్​.. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి 'రామాయణం' చూస్తున్నాడు. ఆ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

Reel Life Ram watched Ramayan with his family
కుటుంబంతో కలిసి 'రామయణం' చూసిన 'రాముడు'
author img

By

Published : Apr 1, 2020, 11:28 AM IST

Updated : Apr 1, 2020, 1:20 PM IST

రీల్‌ రాముడు అరుణ్‌ గోవిల్‌ రియల్‌ లైఫ్‌లో తన కుటుంబంతో కలిసి 'రామాయణం' సిరీస్‌ చూశాడు. 1987లో ఈ సిరీస్‌ బుల్లితెర ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంది. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ ధారవాహికకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇన్నేళ్లకు మళ్లీ 'రామాయణం'ను దూరదర్శన్‌లో ప్రసారం చేస్తున్నారు. సోమవారం ఈ సిరీస్‌ను అరుణ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 'రామాయణం' హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అయ్యింది. బాల్యం గుర్తొస్తోందని చాలా మంది కామెంట్లు చేశారు.

Reel Life Ram watched Ramayan with his family
కుటుంబంతో కలిసి 'రామాయణం' చూస్తున్న రాముడు పాత్రధారి అరుణ్​ గోవిల్​

'రామాయణం' సిరీస్‌ను మార్చి 28 నుంచి దూరదర్శన్‌లో ప్రసారం చేయబోతున్నామని గతవారం కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. పబ్లిక్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఓ ఎపిసోడ్‌, రాత్రి 9 నుంచి 10 వరకు మరో ఎపిసోడ్‌ ప్రసారం అవుతుందని తెలిపారు. 'రామాయణం'లో సీతగా దీపిక చిఖాలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లాహిరి నటించారు. వీరికీ మంచి గుర్తింపు లభించింది. 33 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సిరీస్‌ను దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించాడు.

ఇదీ చూడండి.. రకుల్ సినిమాల్లోకి వచ్చింది అందుకే!

Last Updated : Apr 1, 2020, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.