'మగాళ్లు వట్టి మాయగాళ్లే..' అంటూ వెండితెరపై స్టెప్పులేసిన హీరోయిన్ ప్రియమణి(priyamani).. నిజజీవితంలోనూ తనకు కొంతమంది మాయగాళ్లు ఎదురైనట్లు చెప్పారు. తనకు నచ్చిన వాళ్లను ఇష్టాన్ని వ్యక్తం చేస్తే.. వాళ్లు తనను ఫ్రెండ్జోన్లోకి నెట్టేశారని 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) కార్యక్రమంలో వెల్లడించారు. ఆమె సినీ ప్రయాణంలోని విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ పంచుకున్నారు.
'యమదొంగ' ఎవరి కోసం..
'యమదొంగ' చిత్రంలో నటించేందుకు ఎవరి కోసం ఒప్పుకున్నారు? రాజమౌళి(Rajamouli), ఎన్టీఆర్(NTR) కోసమా? అని వ్యాఖ్యాత ఆలీ ప్రశ్నించగా.. ఎన్టీఆర్ కోసమే ఆ సినిమాకు అంగీకరించినట్లు ప్రియమణి వెల్లడించారు. ఆ తర్వాత షూటింగ్లో రాజమౌళి కుటుంబసభ్యులు కూడా మరింత దగ్గరయ్యారని ఆమె తెలిపారు. ఎప్పటికైనా అల్లు అర్జున్(Allu Arjun), రామ్‌చరణ్(Ram Charan)లతో నటించాలని ఉందని తన మనసులోని బయట పెట్టారు ప్రియమణి.
కాలేజీ రోజుల్లో రోజుకో అబ్బాయి తనను ఫాలో అయ్యేవారని ప్రియమణి తెలిపారు. తెలుగు పరిశ్రమలో రాజమౌళి, పూరీ జగన్నాథ్, రామ్‌గోపాల్ వర్మ వంటి దర్శకులతో పనిచేయడం చాలా ఆనందాన్ని కలిగించిందని ఆమె వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. హీరోయిన్‌కు చేదు అనుభవం.. ఫ్రైడ్‌రైస్‌లో బొద్దింక