సంచలనంగా మారిన బుల్లి తెర నటి ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే దేవరాజ్‌ను విచారిస్తున్న పోలీసులు... సాయి కృష్ణా రెడ్డిని కూడా విచారించనున్నారు. తాజాగా తెరపైకి ఓ సినిమా నిర్మాత పేరు తెరపైకి వచ్చింది. శ్రావణి తరచూ అతనితో మాట్లాడేదని... అతని క్రెడిట్ కార్డులు కూడా వాడేదని దేవరాజ్ పోలీసులకు తెలిపాడు. శ్రావణి చనువుగా ఉండటం వల్ల సాయికృష్ణా రెడ్డి, ఆ సినీ నిర్మాత బెదిరింపులకు పాల్పడ్డారని దేవరాజ్ పోలీసులకు వెల్లడించాడు. దీనికి సంబంధించిన కాల్ రికార్డులను పోలీసులకు సమర్పించాడు. గూగూల్ పే, ఫోన్ పేల ద్వారా నగదు బదిలీ వ్యవహారంపై ఆరా తీశారు. అది కేవలం నగదు బదిలే కానీ... తాను శ్రావణిని బ్లాక్ మెయిల్ చేయలేదని దేవరాజ్ వివరించాడు. ఇందుకు సంబంధిచిన ఆధారాలను పోలీసులకు అందించాడు.
వేధింపులు తట్టుకోలేక చనిపోతానంది..
తాజాగా మరికొన్ని కాల్ రికార్డులను, వాట్సప్ ఆడియో క్లిప్‌లను దేవరాజ్ పోలీసులకు సమర్పించాడు. ఫోన్ సంభాషణలలో శ్రావణి తనను ప్రేమిస్తున్నట్లు చెప్పిందని పేర్కొన్నాడు. వీరిద్దరూ కలిసి ఈ నెల 7న పంజాగుట్టలోని రెస్టారెంట్‌కి వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. అందులో దేవరాజ్‌తో శ్రావణి చనువుగా ఉన్నట్లు గుర్తించారు. తనతో చనువుగా ఉండటం వల్లనే కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని శ్రావణి చెప్పుకొచ్చింది. సాయి కృష్ణా రెడ్డి చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని.. దేవరాజ్‌ని జాగ్రత్తగా ఉండమని శ్రావణి సూచించిన ఆడియో వెలుగులోకి వచ్చింది. అన్నవరంలో పెళ్లి చేసుకుని.. ఎక్కడికైనా దూరంగా వెళ్లి ఉందామంటూ శ్రావణి తనతో చెప్పినట్లు దేవరాజ్ తెలిపాడు. ఈ నెల 8న రాత్రి ఫోన్ చేసిన శ్రావణి... వేధింపులు భరించలేక చనిపోతానని చెప్పిందంటూ దేవరాజ్ పోలీసులకు తెలిపాడు. తనతో శ్రావణి మాట్లాడిన ఆడియోలను పోలీసులకు అప్పగించాడు.
వేధింపులు, మందలింపులపై ఆరా..
ఎవరి వేధింపుల వల్ల శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందో తెలియాల్సి ఉంది. వేధింపులు.. కుటుంబసభ్యుల మందలింపులు తదితర పరిణామాలపై పోలీసులు దృష్టిసారించారు. ప్రస్తుతం దేవరాజ్ ఆరోపిస్తున్నా ఆ చిత్ర నిర్మాతతోపాటు, సాయికృష్ణా రెడ్డిని, కుటుంబ సభ్యులను విచారిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 'బుల్లితెర నటి ఆత్యహత్య కేసును క్షేత్రస్థాయిలో విచారిస్తాం'