నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో 'జబర్దస్త్'. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
గురువారం (మార్చి 25) ప్రసారంకానున్న జబర్దస్త్ ఎపిసోడ్లో రోహిణితో కలిసి హైపర్ ఆది తనదైన పంచులతో వినోదాన్ని పంచారు. కత్తి తిప్పడం నేర్చినవాడే రాజు అంటున్నాడు చలాకీ చంటి. మరోవైపు నిద్రలో పరిగెత్తే భార్యతో రాకెట్ రాఘవ తన కష్టాలను ఫన్నీగా చెప్పుకున్నాడు. తాగుబోతు రమేశ్‌తో పాటు వెంకీ మంకీస్ చేసిన స్కిట్లో భార్య వల్ల వచ్చే సమస్యలతో నవ్వించారు. అసలైన మగాడు అంటే తానేనంటూ అదిరే అభి చెప్పే నిర్వచనం కడుపుబ్బా నవ్వించింది.
ఇదీ చూడండి: ఊహల నుంచి పాట.. ఊపిరి నుంచే మాట!