ETV Bharat / sitara

Corona: సినీపరిశ్రమపై రెండోసారీ.. కరోనా స్వారీ! - కరోనా సెకండ్​ వేవ్​లో బాలీవుడ్ నష్టాలు​

సినిమాలు సరిగ్గా ప్రేక్షకాదరణ పొందక నష్టాలు వచ్చాయంటే మళ్లీ హిట్లు పడతాయిలే అనే ఆశ ఉంటుంది. అసలు సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే అవకాశమే లేకుండా భారీ నష్టాల్ని మూటగట్టుకోవాల్సి వస్తే అది దారుణం. ఇలాంటి ఊహించని పరిస్థితుల్ని, భారీ నష్టాల్ని తెచ్చిపెట్టింది కరోనా మహమ్మారి(Corona Virus). 2020 ఎలాగూ బాలీవుడ్‌ చిత్రసీమ(Bollywood)కు నష్టాలు తప్పలేదు. 2021 అదిరిపోతుంది.. ఈసారైనా లాభాల పంట పండించేద్దాం అనుకున్న చిత్రసీమ ఆశలు ఈసారీ నీరుగారిపోయాయి. ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ అంతా నష్టమే. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం నుంచి థియేటర్లు(theaters reopen in MH) తెరుచుకోనున్నాయి. మరిప్పుడు పెద్ద చిత్రాలు విడుదలవుతాయా? మరికొంత కాలం వేచిచూస్తాయా?

huge losses to the film industry in Covid-19 Second wave
Corona: సినీపరిశ్రమపై రెండోసారీ.. కరోనా స్వారీ!
author img

By

Published : Jun 7, 2021, 6:48 AM IST

2020 తొలి మూడు నెలల్లో హుషారుగా సాగిన బాలీవుడ్‌ సినిమాల ప్రయాణం ఆ తర్వాత నెమ్మదించింది. కరోనా విజృంభణ(Covid-19) ఎక్కువయ్యే కొద్దీ మొత్తం అటకెక్కింది. తొలి దశ కరోనా 2020 చివరినాటికి తగ్గుముఖం పట్టి థియేటర్లు తెరుచుకున్నా సరైన సినిమాలు విడుదల కాలేదు. దీంతో థియేటర్ల యాజమన్యాలు భారీగా నష్టపోయాయి. చిన్నాచితకా చిత్రాలు మినహా భారీ బడ్జెట్‌ సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. 'సూర్యవంశీ', '83' లాంటి సినిమాలు ధైర్యం చేయలేకపోయాయి.

ఇక ఎన్నో ఆశలతో 2021లోకి అడుగుపెట్టినా తొలి మూడు నెలల్లో బాక్సాఫీసును వసూళ్లతో నింపేసే ఒక్క చిత్రమూ విడుదల కాలేదు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఏప్రిల్‌ నుంచి భారీ చిత్రాలు హంగామా మొదలుపెట్టేస్తాయి అనుకున్న ఆశ ఎన్నో రోజులు నిలువలేదు. కరోనా రెండో దశ మొదలైంది. మళ్లీ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లతో చిత్రసీమ మూగబోయింది. అలా బాగా కలెక్షన్లు వచ్చే ఈ వేసవీ కరోనార్పణమైంది.

ఈసారి మరీ దారుణం

కరోనా తొలి దశ ప్రభావం దెబ్బ సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లపై గట్టిగానే పడింది. కరోనా తగ్గుముఖం పట్టి థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇచ్చినా చాలామంది ఆ దిశగా అడుగులు వేయలేదు. అప్పటికే కోలుకోని నష్టాలు రావడం వల్ల సుమారు 1500 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు(Single Screen Theaters) పూర్తిగా మూతపడ్డాయి. అలాంటిది రెండో వేవ్‌ మరీ దారుణంగా సాగింది. సోమవారం నుంచి చిత్ర ప్రదర్శనలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. మరి ఎంత మంది థియేటర్లు తెరుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

పైగా బాలీవుడ్‌ సినిమాలంటే.. దేశవ్యాప్తంగా మార్కెట్‌ ఉంటుంది. మరి దేశమొత్తం అలాంటి ఆశాజనక పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పలేకపోతున్నారు. దీంతో ఈ ఏడాదీ పూర్తిగా మూతపడే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. "భవిష్యత్తు థియేటర్‌ వ్యాపారం అంతా చీకటిమయంగానే కనిపిస్తోంది. తెగించి ముందుకెళితే జీవితాలే నాశనం అయిపోతాయి" అని కొందరు థియేటర్‌ ఓనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశలున్నాయి..

ఓ పక్క 'థియేటర్లకు గడ్డుకాలమే' అని కొందరు తీవ్ర నిరాశతో మాట్లాడుతుంటే మరికొందరు 'ఇదంతా తాత్కాలికమే భవిష్యత్తు బాగుంటుంది' అని ఆశగా చూస్తున్నారు. "అందరూ భయపడుతున్నట్టు ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు జనం రారు అనేది ఒట్టి మాట. ఇప్పటికే ఉత్తరాదిలో కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టింది. పలు భారీ చిత్రాలూ థియేటర్లలో విడుదల చేయడం కోసం వేచి చూస్తున్నాయి. జులై నాటికి పరిస్థితులు ఆశాజనకంగా మారతాయి" అని ప్రముఖ నిర్మాత ఒకరు చెబుతున్నారు.

అక్షయ్‌కుమార్‌ 'సూర్యవంశీ' (Suryavamshi), 'బెల్‌బాటమ్‌'(Bell Bottom) లాంటి చిత్రాలు ఓటీటీ ఆలోచనలో ఉన్నా ఈ నెలాఖరుకు పరిస్థితులు చక్కబడితే థియేటర్లలో విడుదల చేయడానికే సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా '83', 'గంగూబాయి కతియావాడి'(Gangubai Kathiyawadi), 'మైదాన్‌'(Maidaan) లాంటి భారీ చిత్రాలు విడుదల కోసం వేచి చూస్తున్నాయి.

"దక్షిణాదిలో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో భారీ చిత్రాలు విడుదల కావడం వల్ల మంచి వసూళ్లు దక్కాయి. అలాంటి పరిస్థితి హిందీ చిత్రసీమకు వీలు కాలేదు. అందుకే ఇంత నష్టం. కానీ భవిష్యత్తులో బాలీవుడ్‌ పరిస్థితి మెరుగ్గా ఉంటుందనే నమ్మకంతోనే ఉన్నాం."

- ఓ సినిమా ఎగ్జిబిటర్‌

భారీ మూల్యమే..

కొవిడ్‌ రెండో దశ(Corona Second Wave) ప్రభావం రూ.వేల కోట్ల నష్టాన్నే మిగిల్చింది అంటున్నాయి బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు. 2020 తొలి మూడునెలల్లో సుమారు రూ.1550 కోట్లు వసూళ్లు అందుకుంటే 2021లో రూ.50కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయాయి. సినిమాలు థియేటర్లలోకి రాలేదు. వచ్చే నెలల్లో పరిస్థితులు చెప్పలేకుండా ఉన్నాయి. ఎంత లేదన్నా ఈ ఏడాది రూ.3000 - రూ.4000 కోట్లు నష్టం(Huge Loss for Bollywood) తప్పేలా లేదని అంచనా వేస్తున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

ఇదీ చూడండి: CORONA: సోమవారం నుంచి సినిమా థియేటర్లు ఓపెన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.